రైల్వే జాబ్స్ సాధించాలి అనేది ఎంతోమంది యువత డ్రీమ్. తమ ఎలిజిబిలిటీకి తగిన నోటిఫికేషన్స్ రైల్వే నుంచి ఎప్పుడెప్పుడు వస్తాయా అని చాలామంది ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్ !! బిలాస్‌పూర్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) ఆధ్వర్యంలోని పర్సనల్ డిపార్ట్‌మెంట్, డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం ఉద్యోగ నోటిఫికేషన్ (railway jobs 548) రిలీజ్ చేసింది. దీని ద్వారా 548 అప్రెంటిస్ ఖాళీల (railway jobs 548) భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఫిట్టర్, పెయింటర్, ప్లంబర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, టర్నర్, వైర్‌మ్యాన్, గ్యాస్‌కట్టర్, ఫొటోగ్రాఫర్ తదితర విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. 15 నుంచి 24 ఏళ్లలోపు వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి 10+2/ ఐటీఐ ఉత్తీర్ణత పొందిన వారు ఈ జాబ్స్ కు అర్హులు. అకడమిక్ మార్కుల ఆధారంగా క్యాండిడేట్స్ ను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 1 ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ ఉంటుంది. ఆన్‌లైన్ లో https://secr.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ జాబ్స్ కు అప్లై చేయొచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 3న ప్రారంభమైంది. అప్లై చేయడానికి చివరి తేదీ జూన్ 3.
also read : Railways Recruitment: టెన్త్, డిగ్రీతో రైల్వేలో 1.52 లక్షల పోస్టులు
- మొత్తం ఖాళీలు: 548 (railway jobs 548)
- అన్ రిజర్వ్‌డ్: 215
- ఈడబ్ల్యూఎస్: 59
- ఓబీసీ: 148
- ఎస్సీ: 85
- ఎస్టీ: 41