Chhattisgarh : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బీజాపూర్ లో 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరితోపాటు మావోయిస్టులలో కీలక నేత రవీంద్ర కరం సైతం లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఈయన పై రూ.8లక్షల రివార్డు ఉంది. మరో ఇద్దరూ కీలక మావోయిస్టులు రాకేశ్, రోషిణి పై రూ.8లక్సల చొప్పున రివార్డు ఉంది. మొత్తం 13 మంది మావోయిస్టులపై దాదాపు రూ.60 లక్షల రివార్డు ఉన్నట్టు సమాచారం. బీజాపూర్ సీఆర్పీఎఫ్ డీఐజీ దేవేంద్ర నేగీ ఎదుట వీరంతా లొంగిపోయారు.
Read Also: HYD – VJD : హైవే వాహనదారులకు గుడ్‌న్యూస్
పీఎల్‌జీఏ బెటాలియన్ నంబరు-1కు చెందిన ఒకరు, కంపెనీ నంబరు-2 నుంచి నలుగురు, కంపెనీ నంబరు-7 నుంచి ఒకరు, నేషనల్ పార్క్ కుతుల్ ఏరియా కమిటీ ప్లాటూన్ నంబరు-2 నుంచి ఇద్దరు సభ్యులు, పార్టీ ఇతర విభాగాలకు చెందిన వారు లొంగిపోయిన వారిలో ఉన్నారు. ఇందులో 14 మందిపై రూ.68 లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. తక్షణ సాయంగా రూ.25వేల చొప్పున చెక్కులను వారికి అందించారు. ఇది ప్రభుత్వ పునరావాస విధానంతో పాటు భద్రతా బలగాల విజయమని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ పేర్కొన్నారు.
వీరంతా గంగలూరు, బీజాపూర్ జిల్లాలో బాసగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పని చేస్తున్నారని అంటున్నారు. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో 50 మంది లొంగిపోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైందని చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీని కూకటి వేళ్లతో సహా పెకలించి వేస్తామని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇందులో భాగంలో ఆపరేషన్ కగర్ ను తెరపైకి తీసుకొచ్చారు. మావోయిస్టు ఏరివేతను కొనసాగించారు. గత ఏడాదిలో ప్రారంభమైన ఏరివేతను కొనిసాగించారు.
Read Also: Shocking News : ఏపీ ప్రజలకు షాకింగ్ న్యూస్