Site icon HashtagU Telugu

Heavy Rain in Nepal : నేపాల్లో 47 మంది మృతి.. మోదీ దిగ్భ్రాంతి

47 People Died In Nepal.. M

47 People Died In Nepal.. M

పొరుగు దేశం నేపాల్‌(Nepal)లో కురుస్తున్న భారీ వర్షాలు విపరీతమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి. గత రెండు రోజుల్లోనే కాళిదాస్ ధాబౌజీ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడటంతో 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం‌గా ఇప్పటివరకు 47 మంది వర్షాల బారిన పడి మరణించారు. మౌసమ్ విభాగం హెచ్చరికలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Congress Leaders : ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు

ఇంకా తొమ్మిది మంది గల్లంతవ్వగా, మూడువురు పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. తీవ్ర వర్షాలు, నేల చరియల కారణంగా అనేక రోడ్లు, వంతెనలు దెబ్బతిని రవాణా అంతరాయం ఏర్పడింది. నేపాల్ ఆర్మీ, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) సిబ్బంది సంఘటన స్థలాల్లో రెస్క్యూ చర్యలు చేపట్టి, చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు.

ఈ ఘటనలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేపాల్ ప్రజలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, అవసరమైన సహాయం అందిస్తామని X (ట్విటర్)లో పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పొరుగు దేశాల మధ్య పరస్పర సహకారం కీలకమని ఆయన అన్నారు. ఈ దుర్ఘటన నేపాల్‌లోనే కాకుండా భారత సరిహద్దు ప్రాంతాల్లో కూడా అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Exit mobile version