CSIR – 444 Jobs : ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) 444 సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటిలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 368 ఉండగా, సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 76 ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 33 ఏళ్లలోపు ఉండాలి. అయితే వివిధ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జనవరి 14.
We’re now on WhatsApp. Click to Join.
యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.500 చెల్లించాలి.ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మ్యాన్, CSIR డిపార్ట్మెంట్ అభ్యర్థులు, మహిళలకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంది. సెక్షన్ ఆఫీసర్ గ్రూప్-బి (గెజిటెడ్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.47,600 – రూ.1,51,100 మేర పే స్కేల్ లభిస్తుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్-బి (నాన్-గెజిటెడ్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 – రూ.1,42,400 మేర పే స్కేల్ లభిస్తుంది. అభ్యర్థులకు స్టేజ్-1, స్టేజ్-2 రాత పరీక్షలు(CSIR – 444 Jobs) నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులైనవారికి కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి పోస్టులకు ఎంపిక చేస్తారు.