400 Lok Sabha Seats : ఈ ఎన్నికల్లో బీజేపీకి 400 లోక్‌సభ సీట్లు రావడం అసాధ్యమని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జోస్యం చెప్పారు. బీజేపీ చెబుతున్న విధంగా 400 పార్(400 Lok Sabha Seats) అనేది ఆషామాషీ విషయం కాదన్నారు. తెలంగాణ, తమిళనాడు, కేరళలో బీజేపీ ఊసే లేదని ఆయన పేర్కొన్నారు. కీలకమైన మూడు రాష్ట్రాల్లో అస్సలు జాడే లేని బీజేపీకి 400 సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. దక్షిణాదిలో బీజేపీకి గుండా సున్నా తప్ప ఇంకేం రాదని ఖర్గే చెప్పారు. మంగళవారం అమృత్‌సర్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఖర్గే ఈ కామెంట్స్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గబోతున్నాయి. ఆ సీట్లన్నీ ఇండియా కూటమి పార్టీల ఖాతాలో చేరడం ఖాయం. కర్ణాటకలో బీజేపీ బలహీనపడింది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశాలలో ఆ పార్టీ పోటీ ఇస్తోంది. కీలకమైన రాష్ట్రాల్లో అంత బలంగా లేనప్పుడు 400 లోక్‌సభ సీట్లు ఎలా వస్తాయి ? ఏ లెక్కన చూసుకున్నా బీజేపీకి 200 లోక్‌సభ సీట్లు కూడా రావు’’ అని ఖర్గే పేర్కొన్నారు.
Also Read : PM Modi Meditation : కన్యాకుమారిలో రెండు రోజులు ప్రధాని మోడీ మెడిటేషన్
ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఖర్గే ఉద్యోగం ఊడిపోతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన కామెంట్‌పై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను ఉద్యోగం కోసం రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలకు సేవ చేసుకునేందుకే వచ్చా. జూన్ 4 తర్వాత షా.. తన ఉద్యోగం గురించి ఆలోచించుకోవాలి’’ అని కాంగ్రెస్ చీఫ్ హితవు పలికారు. ‘‘ప్రధాని మోడీకి.. మాజీ ప్రధాని మన్మోహన్‌కు చాలా తేడా ఉంది. మోడీ దేశ ప్రజలకు తక్కువ సేవ చేస్తారు. కానీ ఎక్కువగా చెప్పుకుంటారు. మాజీ ప్రధాని మన్మోహన్ ఎంత చేసినా.. ఏం చెప్పుకోలేదు. మన్మోహన్ హయాంలో రూ.72 వేల కోట్ల వ్యవసాయ రుణాలను ఇచ్చారు. అయినా వాటి గురించి మన్మోహన్ గొప్పగా చెప్పుకోలేదు’’ అని ఖర్గే చెప్పుకొచ్చారు.