3015 Jobs : వెస్ట్ సెంట్రల్ రైల్వే (డబ్ల్యూసీఆర్) పరిధిలోని యూనిట్‌లలో శిక్షణ కోసం 3,015 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ కేంద్రంగా వెస్ట్ సెంట్రల్ రైల్వే నడుస్తుంది. పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసిన యువతీ యువకులు ఈ జాబ్స్‌కు అర్హులు. అప్లై చేసే అభ్యర్థులు ఆయా జాబ్‌లకు సంబంధించిన ఐటీఐ ట్రేడ్‌లలో పాసై ఉండటం తప్పనిసరి. పదో తరగతి మార్కులు, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్‌కు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 2023 డిసెంబర్ 14 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
We’re now on WhatsApp. Click to Join.
పోస్టులు ఏయే కేటగిరీలలో ఉన్నాయంటే..
మెకానిక్, ఫుడ్ ప్రొడక్షన్, అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, బ్లాక్‌స్మిత్, బుక్ బైండర్, కేబుల్ జాయింటర్, కార్పెంటర్, కంప్యూటర్ నెట్‌వర్కింగ్ టెక్నీషియన్, డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, డీజిల్ మెకానిక్, డిజిటల్ ఫొటోగ్రాఫర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, హౌస్ కీపర్, మెషినిస్ట్, మాసన్, పెయింటర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్ విభాగాలలో అభ్యర్థులు అప్రెంటిస్‌షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు.
Also Read: Telugu States : ఓ వైపు చలిపులి.. మరోవైపు తుఫాను మేఘాలు
అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.36 ఉంటుంది. మిగతా కేటగిరీల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.136గా నిర్ణయించారు. ఈ జాబ్స్‌కు అప్లికేషన్ల స్వీకరణ డిసెంబరు 15న ప్రారంభమైంది. జనవరి 14 వరకు అప్లై చేసుకోవచ్చు. వెస్ట్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించాలి.