జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ (Pahalgam ) ప్రాంతంలో ఉగ్రవాదులు చెలరేగిన విధంగా కాల్పులు (Terror Attack) జరిపిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన, విమర్శలకు దారితీసింది. పహల్గామ్ ట్రెక్కింగ్‌కు వెళ్లిన పర్యాటకులపై ఏడుగురు ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఇప్పటివరకు 30 మంది పర్యాటకులు (Foreigners) ప్రాణాలు(Dies) కోల్పోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. దాడి జరిగిన ప్రాంతాన్ని భద్రతా దళాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఘటనాస్థలానికి వెళ్లారు.
Terror Attack: కశ్మీర్‌లో ఉగ్రదాడి.. 27 మంది టూరిస్టులు మృతి.. 20 మంది పరిస్థితి విషమం
ఈ దారుణ దాడిపై దేశవ్యాప్తంగా రాజకీయ నాయకుల నుంచి స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ, ఉగ్రదాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని అన్నారు. ‘అమాయకులపై దాడి చేయడం పిరికితనానికి నిదర్శనం. టెర్రరిస్టులపై దేశం ఏకతాటిపైకి వస్తుంది. బాధితులకు పూర్తిగా మద్దతుగా నిలుస్తాం. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ట్వీట్ చేశారు.
ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేస్తూ, “ఈ దుశ్చర్యను ఖండిస్తున్నాను. ఇలాంటి దాడులతో భారతీయుల మనోబలాన్ని తగ్గించలేరు. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి” అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందిస్తూ, అమాయక పర్యాటకులపై ఉగ్రదాడి చేయడం అమానుషమని పేర్కొన్నారు. “ఇది అత్యంత హేయమైన చర్య. బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం అందించాలి” అని పేర్కొన్నారు.