2700 Jobs : ప్రభుత్వ బ్యాంకులో జాబ్స్.. అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో !! ఈ గొప్ప అవకాశాన్ని డిగ్రీ పాసైన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంకు 2700 అప్రెంటిస్ పోస్టుల(2700 Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 34 పోస్టులో తెలంగాణలో 27 పోస్టులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. 20 నుంచి 28 ఏళ్లలోపు వయసు కలిగిన అభ్యర్థులు అప్లై చేయొచ్చు. అయితే వివిధ కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపు అందుబాటులో ఉంది. ఈ పరీక్షకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జులై 14. అభ్యర్థులు https://www.pnbindia.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తును సమర్పించాలి. ఈ వెబ్ సైటులో PNB Apprentice Posts Apply అనే లింకు ఉంటుంది. దానిపై క్లిక్ చేసే అప్లై చేయొచ్చు. అప్లై చేయడానికి జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.800తో పాటు జీఎస్టీ చెల్లించాలి. దివ్యాంగులు రూ.400తో పాటు జీఎస్టీ చెల్లించాలి. మహిళలు, ఎస్టీ, ఎస్సీలు రూ.600తో పాటు జీఎస్టీ చెల్లించాలి.
We’re now on WhatsApp. Click to Join
పంజాబ్ నేషనల్ బ్యాంకు( PNB Jobs) అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసిన వారికి ఆన్లైన్ రాత పరీక్షను నిర్వహిస్తారు. స్థానిక భాష పరీక్ష కూడా ఉంటుంది. తదుపరిగా మెడికల్ టెస్ట్ నిర్వహించి అర్హులను అప్రెంటిస్‌షిప్ కోసం సెలెక్ట్ చేస్తారు. రాతపరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు 25 మార్కులు, జనరల్ ఇంగ్లిష్‌కు 25 మార్కులు, జనరల్/ ఫైనాన్సియల్ అవేర్‌నెస్‌కు 25 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్‌కు 25 మార్కులు ఉంటాయి. 60 నిమిషాల వ్యవధిలో పరీక్షను రాయాలి. ఎంపికైన వారిలో కొందరికి దేశంలోని మెట్రో నగరాల్లో పోస్టింగ్ ఉంటుంది. వీరికి ప్రతినెలా రూ.15,000 స్టైపెండ్ ఇస్తారు. దేశంలోని అర్బన్ ఏరియాల్లో పనిచేసే వారికి ప్రతినెలా రూ.12,000 ఇస్తారు. రూరల్, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో పనిచేసే వారికి ప్రతినెలా రూ.10,000 అందిస్తారు.
Also Read :GHMC Council Meeting : రసాభాసగా ‘జీహెచ్‌ఎంసీ కౌన్సిల్’ సమావేశం.. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఏం చేశారంటే..
దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 6128 క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) నోటిఫికేషన్ ఇటీవలే రిలీజ్ అయింది. జులై 21 వరకు ఈ జాబ్స్‌కు అప్లై చేయొచ్చు. ఈ పోస్టుల్లోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఖాళీలున్నాయి. ఏపీలో 105, తెలంగాణలో 104 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు వీటికి అప్లై చేయొచ్చు.