Vikasith Bharat : పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు : ప్రధాని

దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధాని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం మాలో ఆత్మవిశ్వాసం నింపింది. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం.

Published By: HashtagU Telugu Desk
25 crore people have overcome poverty in ten years: PM Modi

25 crore people have overcome poverty in ten years: PM Modi

Vikasith Bharat : లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ మాట్లాడారు. దేశ ప్రజలు వరుసగా నాలుగోసారి తనను ఆశీర్వదించారని, అందుకు తాను దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధాని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం మాలో ఆత్మవిశ్వాసం నింపింది. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం. గత ప్రభుత్వాలు గరిబీ హఠావో అని నినాదాలు మాత్రమే చేశాయి. కొందరు నేతలు బంగ్లాలు కట్టుకోవడం పై ఆసక్తి చూపారని అన్నారు.

Read Also: Bumper Offer : మందుబాబులకు థాయిలాండ్ ట్రిప్ ఆఫర్ చేసిన వైన్ షాప్ యజమాని

‘వికసిత్‌ భారత్ ’ తమ లక్ష్యమని, పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారని ఆయన చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగం వికసిత్‌ భారత్‌ సంకల్పాన్ని బలోపేతం చేస్తోందని, ప్రజలకు కొత్త ఆశను ఇస్తోందని, స్ఫూర్తిగా నిలుస్తోందని ప్రధాని పేర్కొన్నారు. తాము నకిలీ నినాదాలు ఇవ్వలేదని, ప్రజలకు నిజమైన అభివృద్ధిని అందించామని వెల్లడించారు. ప్రజలు తనకు రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడేందుకు 14 సార్లు అవకాశం ఇచ్చారని, అందుకు వారందరికీ తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ప్రధాని చెప్పారు.

పేదలకు ఇప్పటి వరకు 4 కోట్ల ఇండ్లు నిర్మించామని తెలిపారు. దేశంలో పేదల కోసం 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించాం. అయితే కొందరూ పేదల గుడిసెల్లో ఫొటోలకు ఫోజులిచ్చే వారికి పార్లమెంటులో పేదల గురించి మాట్లాడితే వినడం బోరింగ్‌గానే ఉంటుందని ప్రధాని పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీని విమర్శించారు. ఢిల్లీ నుంచి రూపాయి పంపితే.. గ్రామాలకు 16 పైసలే చేరుతోందని గతంలో ఓ ప్రధాని వాపోయారు. ఇప్పుడు రూపాయి పంపితే గ్రామానికి రూపాయి అందుతోంది అని ప్రధాని మోడీ తెలిపారు.

Read Also: Parliament : రాహుల్ కు ప్రధాని మోడీ కౌంటర్

  Last Updated: 04 Feb 2025, 06:40 PM IST