2424 Jobs : రైల్వేలో 2,424 అప్రెంటిస్ పోస్టులు.. ఎగ్జామ్ లేకుండానే భర్తీ

సెంట్రల్ రైల్వే పరిధిలోని 2,424 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ముంబైలోని రైల్వే రిక్రూట్​మెంట్ సెల్ నోటిఫికేషన్(Central Railway) రిలీజ్ చేసింది.

Published By: HashtagU Telugu Desk
2424 Jobs In Central Railway

2424 Jobs : సెంట్రల్ రైల్వే పరిధిలోని 2,424 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ముంబైలోని రైల్వే రిక్రూట్​మెంట్ సెల్ నోటిఫికేషన్(Central Railway) రిలీజ్ చేసింది. ఈ పోస్టులను భర్తీ చేయనున్న ట్రేడ్స్‌లలో..  ఫిట్టర్, వెల్డర్​, ఎలక్ట్రీషియన్​, కార్పెంటర్​, మెకానిక్, పెయింటర్​, మెషినిస్ట్, షీట్ మెటల్ వర్కర్, మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఉన్నాయి. అభ్యర్థులు RRC అధికారిక వెబ్​సైట్ ద్వారా అప్లై చేయొచ్చు. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఆగస్టు 15. కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి పాసై, సంబంధిత ట్రేడ్​లో ఐటీఐ పాసైన వారు దరఖాస్తు చేయాలి. అభ్యర్థుల వయస్సు 2024 జులై 15 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి.పదో తరగతి, ఐటీఐ మార్కులు, రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను పోస్టులకు(2424 Jobs) ఎంపిక చేస్తారు. ఎంపికయ్యే వారికి సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇస్తారు.

We’re now on WhatsApp. Click to Join

ముంబై క్లస్టర్​ పరిధిలోని మాతుంగ వర్క్‌షాప్‌లో అత్యధికంగా 547 అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి.  పరేల్ వర్క్‌షాప్‌లో  303,  క్యారేజ్ & వ్యాగన్(కోచింగ్) వాడి బండర్‌లో 258 పోస్టులు ఉన్నాయి. సీనియర్‌ డీఈఈ (టీఆర్‌ఎస్‌) కుర్లా వర్క్ షాపులో  192, సీనియర్‌ డీఈఈ (టీఆర్‌ఎస్‌) కల్యాణ్ వర్క్ షాప్‌లో 124 పోస్టులు ఉన్నాయి.  కుర్లా డీజిల్ షెడ్‌లో 60, ఎస్‌ & టీ వర్క్‌షాప్, బైకుల్లా వర్క్ షాపులో  60, కల్యాణ్ డీజిల్ షెడ్‌లో  50 పోస్టులు ఉన్నాయి.

Also Read :Godavari : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. కాసేపట్లో మూడో వార్నింగ్

భుసావల్ క్లస్టర్ పరిధిలోని క్యారేజ్ & వ్యాగన్ డిపో పరిధిలో 122 పోస్టులు ఉన్నాయి.ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్‌షాపులో 118 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రిక్ లోకో షెడ్, భుసావల్ వర్క్ షాపులో  80 పోస్టులు, మన్మాడ్ వర్క్‌షాపులో  51, టీఎండబ్ల్యూ నాసిక్ రోడ్ వర్క్ షాపులో  47 పోస్టులు ఉన్నాయి. ఇక పూణే క్లస్టర్ పరిధిలోని డీజిల్ లోకో షెడ్‌లో 121 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రిక్ లోకో షెడ్, డాండ్‌లో  40 పోస్టులు, క్యారేజ్ & వ్యాగన్ డిపోలో 31 పోస్టులు ఉన్నాయి. నాగ్‌‌పూర్ క్లస్టర్ పరిధిలో క్యారేజ్ & వ్యాగన్ డిపోలో  63  పోస్టులు, ఎలక్ట్రిక్ లోకో షెడ్, అజ్నిలో 48 పోస్టులు ఉన్నాయి.  ఇక షోలాపూర్ క్లస్టర్ పరిధిలోని క్యారేజ్ & వ్యాగన్ డిపోలో 55 పోస్టులు ఉన్నాయి. కుర్దువాడి వర్క్‌షాపులో  21 పోస్టులు ఉన్నాయి.

Also Read :Nabha Natesh : ఆ హీరోయిన్ కి లక్ ఏమాత్రం కలిసి రావట్లేదు..!

  Last Updated: 23 Jul 2024, 08:24 AM IST