Himani Narwal: హిమానీ నార్వాల్ దారుణ హత్య గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. హర్యానా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్‌గా పనిచేసే హిమానీ నార్వాల్‌ను రోహతక్ జిల్లాలో దారుణంగా మర్డర్ చేశారు. ఆమె డెడ్‌బాడీని సూట్‌కేసులో పెట్టి మార్చి 1న సమల్ఖా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బస్టాండ్ శివార్లలో పడేయడం కలకలం రేపింది. హిమానీ డెడ్‌బాడీని పోలీసులు పరిశీలించగా.. చేతికి గాజులు, మెహందీతో పాటు మెడలో కండువా ఉన్నాయి. గొంతు కోసి చంపినట్లు పోలీసులు తేల్చారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చాకే అసలు విషయాలు తెలుస్తాయి. దీనిపై దర్యాప్తునకు హర్యానా సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది.ఇంతకీ హిమానీ నార్వాల్ నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం..
Also Read :Weekly Horoscope : మార్చి 2 నుంచి 8 వరకు వారఫలాలు.. ఆ రాశుల వాళ్లకు రాజయోగం
హిమానీ నార్వాల్ నేపథ్యం ఇదీ..
- హిమానీ నార్వాల్(Himani Narwal) రోహ్‌తక్‌లోని విజయ్ నగర్‌లో నివసించేవారు.
- ఆమె సోనేపట్‌లోని కాథురా గ్రామంలో జన్మించారు.
- రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌లో కార్యకర్త హిమానీ పనిచేసేవారు.
- గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు.
- గత సంవత్సరం జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హిమానీ నార్వాల్ యాక్టివ్‌గా భాగస్తులు అయ్యారు. భూపిందర్ హుడా, దీపిందర్ హుడాలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
- కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ర్యాలీలో జానపద గాయకురాలిగా ఆమె పాత్ర పోషించారు. తన పాటలతో పార్టీ క్యాడర్‌లో ఉత్సాహాన్ని పెంచారు.
- ‘ఇండియన్ యూత్ కాంగ్రెస్’ వైస్ ప్రెసిడెంట్ అని తన ఎక్స్ ఖాతాలో హిమానీ రాసుకున్నారు.
- పోలీసుల కథనం ప్రకారం హిమానీ వయసు 20 నుంచి 22 ఏళ్ల మధ్యలో ఉంటుంది.
కారణమేంటి ?
హిమానీ నార్వాల్ హత్యకు కారణం ఏమిటి? అనే దానిపైనే అంతటా చర్చ జరుగుతోంది. వ్యక్తిగత కక్షలతో ఎవరైనా ఆమెను మర్డర్ చేశారా ? ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా ? ఏదైనా రాజకీయ కుట్ర ఉందా ? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇందులో రాజకీయ కోణం కనిపించడం లేదని అంటున్నారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ప్రకటించారు.