Site icon HashtagU Telugu

23 Emergency Landings: వామ్మో విమానం.. 3 ఏళ్లలో 23 సార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్స్!

Flight

Flight

ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రం కానీ రాష్ట్రానికి వెళ్లాలనుకుంటే ముందుగా గుర్తుకువచ్చేది విమానమే. మరి అలాంటి విమానమే ట్రబుల్ ఇస్తే కచ్చితంగా ఆయా సంస్థలదే తప్పు అవుతుంది. జనవరి 2020 నుండి ఇప్పటి వరకు 23 విమానాలలో ఎయిర్‌లైన్స్ ఆపరేటింగ్ సిబ్బంది ఎమర్జెన్సీని (Emergency Landings) ప్రకటించారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గురువారం లోక్‌సభలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (Aviation Ministry) తెలిపింది. 19 కేసులలో, విమానం ల్యాండింగ్ అయ్యిందని, ప్రభావిత భాగాలను మార్చినట్లు తెలిపింది.

మూడు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ (Emergency Landings)లు వాతావరణ మళ్లింపు కారణంగా జరిగింది. ఒక అత్యవసర ల్యాండింగ్ పక్షి దెబ్బ కారణంగా జరిగింది. ఇలాంటి సంఘటనలను క్షుణ్ణంగా విశ్లేషించి వాటి తీవ్రతను నిర్ణయించారు. మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. ఇండిగో ఎయిర్‌లైన్ విమానాలు 11 అత్యవసర ల్యాండింగ్‌లను ప్రకటించగా,  స్పైస్‌జెట్ విమానాలు జనవరి 2020 నుండి ఇప్పటి వరకు నాలుగు సందర్భాల్లో ల్యాండ్ అయ్యింది. ఎయిర్ ఇండియా రెండు, ఎయిర్ ఒక సారి మాత్రమే ల్యాండ్ అయ్యాయి.

“తయారీదారు మార్గదర్శకాల ప్రకారం ఆపరేటర్లు తమ విమానాలను నిర్వహిస్తారు. విఫలమైన ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ కారణంగా అత్యవసర ల్యాండింగ్ వంటి సంఘటనల సందర్భంలో సిస్టమ్ నిర్వహణ సరిదిద్దబడుతుంది. DGCA పరిశోధన ఫలితాల ఆధారంగా, వాతావరణ మళ్లింపు కారణంగా అత్యవసర ల్యాండింగ్ పునరావృతం కాకుండా నిరోధించడానికి, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 2021, 2022లో రెండు సర్క్యులర్‌లను జారీ చేసింది.

Also Read: Shashikala Died: రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కున్న అమ్మాయి మృతి