IB Jobs -226 : ఇంటెలిజెన్స్ బ్యూరోలో 226 జాబ్స్.. టెకీలకు గుడ్ ఛాన్స్

IB Jobs -226 : అసిస్టెంట్​ సెంట్రల్​ ఇంటెలీజెన్స్​ ఆఫీసర్ (ACIO) పోస్టుల భర్తీకి ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • Written By:
  • Publish Date - December 24, 2023 / 12:01 PM IST

IB Jobs -226 : అసిస్టెంట్​ సెంట్రల్​ ఇంటెలీజెన్స్​ ఆఫీసర్ (ACIO) పోస్టుల భర్తీకి ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 226 ACIO పోస్టులను రిక్రూట్ చేయనుంది. వీటిలో 147 పోస్టులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్​ విభాగంలో, 79 పోస్టులు కంప్యూటర్​ సైన్స్ అండ్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ విభాగంలో ఉన్నాయి. ఈ పోస్టులలో 93 అన్ రిజర్వుడ్ కేటగిరీలో ఉన్నాయి. 24 పోస్టులు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్), 71 పోస్టులు ఓబీసీలకు, 29 పోస్టులు ఎస్సీలకు, 9 పోస్టులు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఎలక్ట్రానిక్స్​/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యునికేషన్​/ ఎలక్ట్రానిక్స్​ అండ్ కమ్యునికేషన్​/ ఎలక్ట్రికల్​ అండ్ ఎలక్ట్రానిక్స్​/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్​ సైన్స్​/ కంప్యూటర్ ఇంజినీరింగ్​/ కంప్యూటర్​ సైన్స్ అండ్​ ఇంజినీరింగ్‌లలో బీఈ లేదా బీటెక్ ​ చేసిన వారు ఈ జాబ్స్‌కు అర్హులు.  ఎలక్ట్రానిక్స్​/ ఫిజిక్స్​ విత్​ ఎలక్ట్రానిక్స్​ లేదా ఎలక్ట్రానిక్స్​ అండ్​ కమ్యునికేషన్​/ కంప్యూటర్ సైన్స్‌లలో ఎంఎస్సీ చేసినవారు కూడా వీటికి అప్లై చేయొచ్చు. కంప్యూటర్స్ అప్లికేషన్స్‌లో పీజీ చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.  2021/ 2022/ 2023లలో ఏదో ఒక సంవత్సరానికి సంబంధించిన గేట్ స్కోర్​​  కూడా తప్పనిసరిగా అభ్యర్థులకు ఉండాలి.

Also Read: Prashant Kishor – IPAC : ఐప్యాక్.. ప్రశాంత్ కిషోర్.. ఏపీలో పొలిటికల్ హీట్

2024 జనవరి 12 నాటికి 18 ఏళ్లు నుంచి 27 ఏళ్లలోపు వయసు కలిగిన ఈ పోస్టులకు(IB Jobs -226) అర్హులు. జనరల్​, ఓబీసీ, ఈడబ్లూఎస్​ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. గేట్​ స్కోర్​/ ఇంటర్వ్యూ, సైకోమెంట్రిక్​/ ఆప్టిట్యూడ్​ టెస్ట్​, డాక్యుమెంట్​ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్​ తర్వాత అభ్యర్థులను అసిస్టెంట్​ సెంట్రల్​ ఇంటెలిజెన్స్ ఆఫీసర్​ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికయ్యే అభ్యర్థులకు ప్రతినెలా పే స్కేలు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు లభిస్తుంది. అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అభ్యర్థులు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్​ అధికారిక వెబ్​సైట్​ https://www.mha.gov.in  ద్వారా అప్లికేషన్లు సమర్పించవచ్చు.  అప్లికేషన్లు సమర్పించడానికి లాస్ట్ డేట్ జనవరి 12. అప్లికేషన్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ జనవరి 16.