Site icon HashtagU Telugu

Union Budget 2024 : ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో బడ్జెట్..

Nirmala Sitharaman

Nirmala Sitharaman

Union Budget 2024 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వరుసగా ఆరు సంవత్సరాలు భారతదేశ బడ్జెట్లను ప్రవేశపెట్టి కొత్త రికార్డు సాధించారు. అయితే.. ఈ రోజు లోక్‌సభలో ప్రతిపక్షాలు నిరసనలు తెలియజేసినా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-25 బడ్జెట్‌లో, ఆమె ముఖ్యంగా ఆరోగ్య, విద్య, పరిశ్రమల అభివృద్ధి, పన్ను సంస్కరణలు వంటి కీలక విభాగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గత బడ్జెట్లలో పన్ను విధానాలు, వ్యవసాయ మద్దతు, మెడికల్ సౌకర్యాలు, స్మార్ట్ నగరాల నిర్మాణం వంటి పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా అభివృద్ధికి పునాది వేశారు. ఆమె బడ్జెట్‌లు దేశంలో మార్పులదిశగా అడుగులు వేసేందుకు, సంక్షేమ పథకాలను ప్రేరేపించేందుకు, దేశవ్యాప్తంగా పెద్ద పరిశ్రమల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. ఈసారి కూడా ఆరోగ్య, డిజిటల్ టెక్నాలజీ, ప్రైవేటు రంగం, గ్రామీణ అభివృద్ధి తదితర విభాగాల్లో మరింత పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలపై ఆమె దృష్టి పెట్టారు.

Union Budget 2025: పేద, మధ్యతరగతి వర్గాలపై వరాలు కురిసేనా?

అయితే.. ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు నిర్మల సీతారామన్‌. ఇన్ ఫ్రా, మధ్య తరగతి ప్రజల వికాసమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించినట్లు ఆమె తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.. మేము చేపట్టిన సంస్కరణలు.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయని ఆమె తెలిపారు. అంతేకాకుండా… పప్పుధాన్యాల కోసం 6 సంవత్సరాల ప్రణాళిక ప్రకటించారు నిర్మలా సీతారామన్‌. బీహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. దేశంలో 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చనున్నట్లు మంత్రి నిర్మలా తెలిపారు.

అంతేకాకుండా.. దేశవ్యాప్తంగా ఎంపికచేసిన వంద జిల్లాల్లో ప్రధాన మంత్రి ధాన్య యోజన పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ధాన్యం ఉత్పత్తి తక్కువగా ఉన్న, వ్యవసాయం లాభసాటిగా లేని 100 జిల్లాల్లో రాష్ట్రాల భాగస్వామ్యంతో 1.7 కోట్ల మంది రైతుల జీవితాలను మార్చడం కోసం ఈ పథకాన్ని చేపట్టనున్నామని ఆమె తెలిపారు.

LPG Price Update: కాసేప‌ట్లో బ‌డ్జెట్‌.. ముందే గుడ్ న్యూస్ చెప్పిన మోదీ స‌ర్కార్‌!