CEC Press Meet : ప్రపంచంలోనే పెద్ద ఎలక్షన్స్.. 64.2 కోట్ల మంది ఓటేశారు : సీఈసీ

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు చాలా పెద్దవని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్‌కుమార్‌ తెలిపారు.

  • Written By:
  • Publish Date - June 3, 2024 / 02:04 PM IST

CEC Press Meet : 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు చాలా పెద్దవని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్‌కుమార్‌ తెలిపారు. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటు వేశారని.. ఇదొక ప్రపంచ రికార్డు అని ఆయన చెప్పారు. ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు.  రేపు (జూన్ 4న) సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఈనేపథ్యంలో సోమవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఈసీ రాజీవ్‌కుమార్‌ కీలక వివరాలను తెలియజేశారు. ఈసారి మన దేశంలో 31.2 కోట్ల మంది మహిళలు ఓటు చేశారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లకు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చాలా పటిష్ఠంగా జరగనుందన్నారు. అయితే ఎన్నికల ముగింపుపై ఈసీ ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటుచేయడం ఇదే తొలిసారి.

We’re now on WhatsApp. Click to Join

సీఈసీ వెల్లడించిన కీలక వివరాలివీ.. 

  • ఈ సార్వత్రిక ఎన్నికల్లో మన దేశంలో మొత్తం 64.2 కోట్ల మంది ఓటు వేశారు.
  • మన దేశంలో ఓటు వేసిన వారి సంఖ్య (64.2 కోట్లు) జీ7 దేశాల్లోని మొత్తం ఓటర్ల సంఖ్య కంటే 1.5 రెట్లు ఎక్కువ. యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాల ఓటర్ల సంఖ్య కంటే 2.5 రెట్లు ఎక్కువ.
  •  ఈ ఎన్నికల్లో 1.5 కోట్ల మంది పోలింగ్‌, సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వర్తించారు.
  • 68,763 బృందాలు ఈ ఎన్నికలను పర్యవేక్షించాయి.
  • 135 ప్రత్యేక రైళ్లను ఈ ఎన్నికల ప్రక్రియ కోసం వినియోగించారు.
  • ఎన్నికల ఏర్పాట్ల కోసం 4లక్షల వాహనాలను ఉపయోగించారు.
  • 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రీపోలింగ్  అవసరం రాలేదు.
  • గత ఎన్నికల్లో 540 చోట్ల రీపోలింగ్‌ నిర్వహించగా.. ఈసారి ఆ సంఖ్య 39కు తగ్గింది. వీటిలో 25 పోలింగ్ కేంద్రాలు రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
  • గత నాలుగు దశాబ్దాలతో పోలిస్తే జమ్మూకశ్మీర్‌లో అత్యధిక ఓటింగ్‌ నమోదైంది.
  • ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సోదాల ద్వారా రూ.10వేల కోట్ల విలువైన నగదు, కానుకలు, డ్రగ్స్‌, మద్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నారు. 2019లో ఈ సంఖ్య కేవలం రూ.3,500కోట్లు.
  • సీ-విజిల్‌ యాప్‌లో 4.56 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. వీటిల్లో 99.9శాతం ఫిర్యాదులను పరిష్కరించారు. వీటిలో 87.5శాతం కంప్లయింట్స్‌ను 100 నిమిషాల్లోపే పరిష్కరించారు.

Also Read : Raveena Tandon : రవీనా టాండన్ మద్యం తాగారా ? క్లారిటీ ఇచ్చిన పోలీసులు