China Apps Data Theft : ఆ రెండు యాప్స్ వద్దు.. మీ ఇన్ఫర్మేషన్ చైనాకు ఇస్తాయ్

సమాచార చోరీకి తెగబడుతున్న ఆ రెండు యాప్స్ లో మొదటిది.. "ఫైల్ రికవరీ అండ్ డేటా రికవరీ"(File Recovery & Data Recovery) యాప్ !! ఇది ఒక మిలియన్ (10 లక్షల) కంటే ఎక్కువ ఇన్‌స్టాల్‌లను కలిగి ఉంది.

  • Written By:
  • Updated On - July 10, 2023 / 11:43 AM IST

China Apps Data Theft :  భారత ప్రజల సమాచార లూటీని చైనా యాప్స్ ఆపడం లేదు.. 

గూగుల్ ప్లే స్టోర్ లోని రెండు చైనా యాప్స్ సున్నితమైన సమాచారాన్ని సేకరించి చైనాలోని సీక్రెట్ సర్వర్లకు పంపుతున్నాయనే కథనాలు వస్తున్నాయి. 

మన దేశంలో దాదాపు 15 లక్షల మందికిపైగా డౌన్ లోడ్ చేసుకున్న ఆ రెండు ఫైల్ మేనేజ్‌మెంట్ యాప్స్ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 

సమాచార చోరీకి తెగబడుతున్న ఆ రెండు యాప్స్ లో మొదటిది.. “ఫైల్ రికవరీ అండ్ డేటా రికవరీ”(File Recovery & Data Recovery) యాప్ !! ఇది ఒక మిలియన్ (10 లక్షల) కంటే ఎక్కువ ఇన్‌స్టాల్‌లను కలిగి ఉంది. “ఫైల్ మేనేజర్”(File Manager)  అనే పేరు కలిగిన మరో యాప్ దాదాపు 5 లక్షల కంటే ఎక్కువ ఇన్‌స్టాల్‌లను కలిగి ఉంది. ఈ రెండు యాప్‌లను కూడా  చైనాకు చెందిన వాంగ్ టామ్ అనే పబ్లిషర్  గూగుల్ ప్లే స్టోర్  లో అప్ లోడ్ చేశారు.

Also read : 200 People Missing : 200 మందితో బయలుదేరిన బోటు గల్లంతు.. ఏమైంది ?

చైనాకు చెందిన ఈ రెండు ఫైల్ మేనేజ్‌మెంట్ యాప్స్ హానికరమైన ప్రవర్తనను కలిగి ఉన్నాయని(China Apps Data Theft) సైబర్ సెక్యూరిటీ కంపెనీ ప్రాడియో తెలిపింది. ఇవి యూజర్స్ సమాచారాన్ని చైనాలో ఉన్న హానికరమైన సర్వర్‌లకు సీక్రెట్ గా పంపుతున్నాయని  పేర్కొంది. వినియోగదారుల సమాచారాన్ని దొంగిలించేలా ఈ యాప్స్ లో ప్రోగ్రామింగ్ ఉందని వెల్లడించింది. “ఫైల్ రికవరీ అండ్ డేటా రికవరీ”, “ఫైల్ మేనేజర్” అనే ఈ యాప్స్ దొంగిలిస్తున్న డేటాలో ఈమెయిల్స్, సోషల్ నెట్‌వర్క్‌లు, ఫోటోలు, వీడియోలు, ఆడియో, డాక్యుమెంట్స్  ఉన్నాయని సైబర్ సెక్యూరిటీ కంపెనీ ప్రాడియో వివరించింది. వినియోగదారుడు ఎక్కడి వాడు.. దేశం కోడ్ ఏది.. ఇంటర్నెట్  నెట్‌వర్క్ ప్రొవైడర్ పేరు వంటి వివరాలను కూడా  అవి దొంగిలిస్తున్నాయని ఆరోపించింది.