Site icon HashtagU Telugu

1971 Vs 2025 Years :1971, 2025 ఒకేలా లేవు.. ఇప్పుడు పాక్ వద్ద అణ్వస్త్రాలున్నాయ్ : శశిథరూర్

Shashi Tharoor 1971 Vs 2025 Years Pm Modi Indira Gandhi Congress India Pakistan

1971 Vs 2025 Years : ‘‘బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం చేయడం నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నాయకత్వ పటిమకు నిదర్శనం. బంగ్లాదేశ్ విముక్తి జరిగే వరకు యుద్ధాన్ని ఇందిర కొనసాగించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న మోడీ సర్కారు మూడు, నాలుగు రోజులకే పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది’’ అంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read :Ambanis Mango Empire: రిలయన్స్ మామిడి సామ్రాజ్యం.. 600 ఎకరాల్లో 1.30 లక్షల మ్యాంగో ట్రీస్

1971లో ఇందిరాగాంధీ వల్లే గొప్ప విజయం

‘‘1971తో పోలిస్తే 2025లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. భారత్ – పాకిస్తాన్(1971 Vs 2025 Years) మధ్య ఇటీవలే ఉద్రిక్తతలు అదుపుతప్పే దశకు చేరుకున్నాయి. అందుకే  పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రతిపాదనకు భారత ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మనకు శాంతి అవసరం. శాంతితోనే దేశ వికాసం సాధ్యమవుతుంది’’ అని శశిథరూర్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వైఖరిని ఆయన స్పష్టంగా వ్యతిరేకించారు. ‘‘1971 నాటి ఇందిరాగాంధీ కాలానికి, ఇప్పటి మోడీ కాలానికి చాలా తేడా ఉంది. మోడీ సర్కారు ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది’’ అని శశిథరూర్ పేర్కొన్నారు. ‘‘1971లో ఇందిరాగాంధీ సారథ్యంలో భారత్ గొప్ప విజయం అందుకుంది. దాన్ని తలచుకొని ప్రతీ భారతీయుడు గర్విస్తాడు. నేను కూడా అందుకు గర్విస్తాను. ఆ విజయం వల్ల ఇందిరా గాంధీజీ ఉపఖండం యొక్క పటాన్ని తిరిగి గీశారు. కానీ ఇప్పటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. నేడు పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి.  భారీ ఆయుధ సంపత్తి ఉంది’’ అని ఆయనగుర్తు చేశారు.

Also Read :Ceasefire Inside Story: పాక్ అణు స్థావరాలపై దాడికి సిద్ధమైన భారత్.. అందుకే సీజ్‌ఫైర్‌కు అంగీకారం

యుద్ధం వల్ల యావత్ దేశానికి ముప్పు

‘‘భారత ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. సైనికులు, ప్రజల మరణాలను భారతీయులు కోరుకోవడం లేదు. ఇటీవలే భారత్ -పాక్ ఉద్రిక్తతల వల్ల మనం కూడా నష్టపోయాం. ఇబ్బందిపడ్డాం. పూంచ్ ప్రజలను అడగండి విషయమేంటో తెలుస్తుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత మనం పాకిస్తాన్ ఉగ్రవాదులకు గుణపాఠాన్ని నేర్పించాలనుకున్నాం.. నేర్పించాం. పాకిస్తాన్‌తో యుద్ధాన్ని ఆపమని నేను చెప్పడం లేదు. అయితే ఈసైనిక ఘర్షణను కొనసాగించడానికి సమంజసమైన  కారణాలు ఉండాలి. దీర్ఘకాలిక యుద్ధం వల్ల యావత్ దేశం ప్రమాదంలో పడుతుంది’’ అని శశిథరూర్ వ్యాఖ్యానించారు.