ఐపీల్ ఫైనల్ (IPL 2025) మ్యాచ్ లో పంజాబ్ పై విజయం సాధించి 18 ఏళ్ల నిరీక్షణ కు తెరదించారు RCB టీం. ఈ సందర్బంగా బుధువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం లో విజయోత్సవ వేడుక ఏర్పాటు చేసారు. కానీ ఈ విజయోత్సా వేడుక కాస్త విషాద వేడుకగా మారింది. వేడుక ను చూసేందుకు లక్షలాది మంది అభిమానులు స్టేడియం వద్దకు చేరుకోవడం తో ఒక్కసారిగా తొక్కిసలాట (Stampede ) ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన లో ఇప్పటివరకు 15 మంది మరణించగా..50 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటన తో మరోసారి ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ తెరపైకి వచ్చింది. దేశంలో గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు తొక్కిసలాటల్లో చనిపోయిన వారి సంఖ్య 175కి చేరింది. మానవీయ చర్యల్లో విఫలం కావడం వల్ల ఇలా విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
Virat Kohli: కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. విరాట్‌ను చూడాలంటే ఆగస్టు వరకు ఆగాల్సిందే!
2024 జూలైలో ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో భోలే బాబా సత్సంగ్ సందర్భంగా 121 మంది చనిపోవడం ఈ దుస్థితికి నిదర్శనంగా నిలిచింది. ఆ తర్వాత డిసెంబర్‌లో పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద ఏర్పడిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. 2025 జనవరిలో తిరుపతిలో టోకెన్ల జారీ సమయంలో భక్తులు ఎగబడి ఆరుగురు చనిపోగా, అదే నెలలో మహాకుంభమేళా సందర్భంగా మరో 30 మంది మృతి చెందారు. మే నెలలో గోవాలోని ఓ ప్రసిద్ధ ఆలయంలో భక్తుల రద్దీ కారణంగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది.
ఈ వరుస ఘటనలు చూస్తే.. మన దేశంలో భద్రతా ప్రణాళికల లోపాలు, క్రమశిక్షణలేని సమూహ నియంత్రణ, మరియు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎప్పటికైనా ఈ దుర్ఘటనలకు చెక్ పెట్టాలంటే, భద్రతా సన్నాహకాల్లో మార్పులు, ఆధునిక టెక్నాలజీ వినియోగం, మరియు సమర్థవంతమైన ప్రజల మార్గదర్శన వ్యవస్థలు ఏర్పాటవ్వాలి. ప్రజల ప్రాణాలు విలువైనవని గుర్తించి, ఏ కార్యక్రమమైనా సురక్షితంగా నిర్వహించేందుకు అధికారులు ముందడుగు వేయాల్సిన సమయం.