Boy Rescued : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణ జిల్లాలో బోరుబావిలో పడిన పదేళ్ల బాలుడు సుమిత్ మీనాను ఎట్టకేలకు రక్షించారు. 16 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత బాలుడిని రెస్క్యూ టీమ్ కాపాడింది. బోరుబావిలోని 39 అడుగుల లోతు నుంచి బాలుడిని బయటికి తీశారు. దీంతో శనివారం సాయంత్రం 5 గంటలకు సుమిత్ మీనా ఓపెన్ బోర్‌వెల్‌లో పడినప్పటి నుంచి మొదలైన టెన్షన్‌కు తెరపడింది. గుణా జిల్లాలోని రాఘౌగఢ్ గ్రామంలో ఉన్న రఘోఘర్ జంజలి ప్రాంతంలో ఉన్న బోరుబావిలో బాలుడు పడ్డాడు. రెస్క్యూ టీమ్ బోరుబావికి సమాంతరంగా 45 అడుగుల గొయ్యిని తవ్వి.. క్లిష్టమైన రెస్యూ ఆపరేషన్ చేశారు. ఇందుకోసం అత్యాధునిక యంత్రాలను, డ్రిల్లింగ్ పరికరాలను వాడారు. ఈక్రమంలో బాలుడికి(Boy Rescued) పైప్ ద్వారా ఆక్సిజన్ అందించారు.
Also Read :Manmohan Daughters : మన్మోహన్‌సింగ్ ముగ్గురు కుమార్తెలు ఏం చేస్తున్నారు ?
బాలుడిని బోరుబావి నుంచి బయటికి తీసిన వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడు సుమిత్ మీనా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిపై ఆస్పత్రి వైద్యులు కాసేపట్లో అధికారిక ప్రకటన విడుదల చేస్తారని సమాచారం. బాధిత బాలుడు సుమిత్ మీనా గుణా జిల్లాలోని పిప్పలియా గ్రామస్తుడు. నివాసి సుమిత్ మీనా శనివారం సాయంత్రం సుమారు 5 గంటలకు తెరిచి ఉన్న బోర్వెల్లో పడిపోయారు. పటంగులు లూటేటప్పుడు ప్రమాదం జరిగింది. ఆయన చాలా ఆలస్యంగా ఇంటికి చేరుకోలేకపోయినందున ఆయనను వెతికారు. ఈ సమయంలో ఆయన తల బోర్వెల్ గడ్దులో కనిపించి, ఆ తరువాతా పరిపాలన అధికారులకు తెలియజేశారు.
Also Read :Telangana TDP : తెలంగాణలో టీడీపీ రీ ఎంట్రీ ఆ జిల్లా నుంచే!
రాజస్థాన్‌లో మరో ఘటన..
రాజస్థాన్‌లోని కట్‌పుత్లీ పట్టణం సరుంద్ ప్రాంతంలో ఉన్న బోరుబావిలో పడిన మూడేళ్ల బాలిక చేతన రెస్క్యూ ఆపరేషన్ వారం రోజులుగా కొనసాగుతోంది. ఆ బాలిక 120 అడుగుల లోతైన బోరుబావిలో పడింది. దీంతో బోరుబావికి సమాంతరంగా 7 అడుగుల కందకాన్ని తవ్వి బాలికను వెలికి తీయడానికి ఎక్కువ సమయం పడుతోంది. బాలికకు ఆక్సిజన్ అందిస్తూ రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు.