Muslim MPs : ఈసారి 15 మంది ముస్లింలు లోక్‌సభకు..

ఈ లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల తరఫున 78 మంది ముస్లిం అభ్యర్థులు  పోటీ చేశారు.

  • Written By:
  • Updated On - June 5, 2024 / 08:24 AM IST

Muslim MPs : ఈ లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల తరఫున 78 మంది ముస్లిం అభ్యర్థులు  పోటీ చేశారు. అయితే వారిలో15 మంది లోక్‌సభకు ఎన్నికయ్యారు.  ఇలా గెలిచిన వారిలో టీఎంసీ అభ్యర్థి,  మాజీ భారత క్రికెటర్ యూసుఫ్ పఠాన్ కూడా ఉన్నారు. ఈయన గుజరాత్‌లోని బరోడా వాస్తవ్యుడు. అయినా సొంత రాష్ట్రంలో కాకుండా బెంగాల్‌లోని బహరంపూర్ స్థానం నుంచి పోటీ చేశారు. యూసుఫ్ పఠాన్‌కు మమతా బెనర్జీ ఎంపీ టికెట్ ఇచ్చారు. వాస్తవానికి 2019 లోక్‌సభ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు ముస్లింలకు కేవలం 115 సీట్లే ఇచ్చాయి. ఈసారి ఆ సంఖ్య మరింతగా తగ్గిపోయి 78కి చేరింది. దీన్నిబట్టి ముస్లిం అభ్యర్థులకు(Muslim MPs) టికెట్లు ఇచ్చేందుకు రాజకీయపార్టీలు మొగ్గుచూపడం లేదనే విషయం స్పష్టమవుతోంది.

We’re now on WhatsApp. Click to Join

  • ఈ ఎన్నికల్లో యూపీలోని సహరాన్‌పూర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి ఇమ్రాన్‌ మసూద్‌ 64,542 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
  • కైరానా నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి 29 ఏళ్ల ఇక్రా చౌదరి 69,116 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ప్రదీప్‌పై విజయం సాధించారు.
  • ఘాజీపూర్ నుంచి ప్రస్తుత ఎంపీ అఫ్జల్ అన్సారీ 5.3 లక్షల ఓట్లతో గెలిచారు.
  • ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన మాధవి లతపై 3,38,087 ఓట్ల తేడాతో హైదరాబాద్ స్థానంలో గెలిచారు.
  • లడఖ్‌లో స్వతంత్ర అభ్యర్థి మహ్మద్ హనీఫా 27,862 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
  • మరో స్వతంత్ర అభ్యర్థి అబ్దుల్ రషీద్ షేక్ జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా స్థానంలో 4.7 లక్షల ఓట్లతో విజయం సాధించారు.
  • ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మొహిబ్బుల్లా 4,81,503 ఓట్లతో గెలిచారు.
  • సంభాల్‌లో జియా ఉర్ రెహ్మాన్ 1.2 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు.
  • నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన మియాన్ అల్తాఫ్ అహ్మద్ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ సీటులో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీపై 2,81,794 ఓట్ల తేడాతో గెలిచారు.
  • శ్రీనగర్‌లో నేషనల్ కాన్పరెన్స్ పార్టీ అభ్యర్థి అగా సయ్యద్ రుహుల్లా మెహదీకి 3,56,866 ఓట్లు వచ్చాయి.
  • బెంగాల్‌లోని బహరంపూర్ స్థానంలో తొలిసారిగా పోటీ చేసిన యూసుఫ్ పఠాన్ లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత,  ఆరుసార్లు ఎంపీగా గెలిచిన అధిర్ రంజన్ చౌదరిపై 85,022 ఓట్ల తేడాతో విజయం సాధించారు.