PM Kisan Yojana: జూన్ చివర్లో పీఎం కిసాన్ నిధి

పేద రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం రైతులంతా ఎదురుచూస్తున్నారు

PM Kisan Yojana: పేద రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం రైతులంతా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద రైతులకు 13 విడతలు పూర్తవ్వగా ఇప్పుడు 14వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 13వ విడత రైతులకు అందింది. ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలకు 2000 రూపాయలు అందించింది. ఈ పథకం కింద 14వ విడతను ప్రభుత్వం జూన్ చివరి వారంలో రైతుల ఖాతాలో డిపాజిట్ చేయనుంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

14వ విడత సొమ్మును పొందడానికి రైతులు తప్పనిసరిగా ఇ-కెవైసి పూర్తి చేయాలి. ఇది కంప్లీట్ కాకుండా ఖాతాలో డబ్బు జమా అవ్వడం కుదరదు. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం లబ్ధిదారులకు 6000 రూపాయలు ఇస్తుంది. ప్రభుత్వం ఈ డబ్బును రైతుల బ్యాంకు ఖాతాలకు ఒకేసారి కాకుండా విడతల వారీగా పంపనుంది. ఒక్కో విడతలో రూ.2000 చొప్పున మూడు విడతలుగా పంపిస్తుంది. ప్రధానమంత్రి పథకం కింద 13వ విడత 27 ఫిబ్రవరి 2023న జమా అయింది, దీని కింద దేశంలోని 8 కోట్ల మందికి పైగా రైతులు ప్రయోజనం పొందారు.

Read More: Summer Dry Lips: వేసవిలో పదేపదే పెదాలు పొడిబారుతున్నాయా.. ఈ చిట్కాలు పాటించాల్సిందే?