13 Indians Missing : కొమొరోస్ జెండాతో యెమన్‌లోని ఓడరేవు నగరం ఎడెన్ వైపు వెళ్తున్న ‘‘ప్రెస్టీజ్ ఫాల్కన్’’ అనే పేరు కలిగిన ఆయిల్ ట్యాంకర్ ఒమన్ సముద్ర తీరంలో ప్రమాదానికి గురైంది. ఒమన్‌లోని దఖ్మ్ నౌకాశ్రయం సమీపంలోని రాస్ మద్రాకా ప్రాంతానికి 25 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో అందులోని 13 మంది భారతీయ సిబ్బంది(13 Indians Missing), ముగ్గురు శ్రీలంక సిబ్బంది ఆచూకీ గల్లంతయ్యింది. ఇప్పటి వరకు ఎవరి జాడ దొరకలేదు. వారిని రక్షించేందుకు ఒమన్ నౌకాదళం రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించింది.
We’re now on WhatsApp. Click to Join
ఈప్రమాదం వివరాలను మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ (MSC) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఒమన్‌లోని దఖ్మ్ నౌకాశ్రయం పారిశ్రామిక ప్రాంతంలో ఒక ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం కూడా ఉంది. అది ఒమన్ దేశానికి చెందిన అతిపెద్ద ఏకైక ఆర్థిక ప్రాజెక్ట్. షిప్పింగ్ డేటా ప్రకారం.. ప్రమాదానికి గురైన ఈ ఆయిల్ ట్యాంకర్ నౌకను(Oil Tanker Sinks Off) 2007లో నిర్మించారు. దీని పొడవు 117 మీటర్లు. సాధారణంగా దగ్గరలోని ప్రయాణాల కోసం ఇలాంటి చిన్న ట్యాంకర్లను ఉపయోగిస్తుంటారు.
Also Read :Iranian Plot : ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర ? అమెరికా నిఘా వర్గాలకు సమాచారం
పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో ఉన్న సేఫ్ జోన్‌లపైనా ఇజ్రాయెల్ తాజాగా బాంబుల వర్షం కురిపించింది. సౌత్ గాజా నగరం ఖాన్ యూనిస్ శివారు ప్రాంతం మువాసీలో భీకర దాడులు చేసింది. ఓ గ్యాస్ స్టేషన్‌కు సమీపంలో ఏర్పాటు చేసుకున్న గుడారాలపై భీకర దాడులు జరిపింది. ఈ దాడుల్లో 17 మంది మృతి చెందారు. హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించిన తర్వాత వేలాది మంది శరణార్థులు మువాసీ ప్రాంతానికి తరలివచ్చారు. ఈ ప్రాంతాన్ని ఇటీవలే సేఫ్ జోన్ల జాబితాలో చేర్చారు. అయినా ఇదంతా పట్టించుకోకుండా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒక్కరాత్రే 60 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. సురక్షిత జోన్‌గా ప్రకటించిన ప్రాంతాలనూ ఇజ్రాయెల్ వదలకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే ప్రాంతంలో శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 90 మంది పాలస్తీనీయన్లు చనిపోగా.. 200 మందికి పైగా గాయాలయ్యాయి.