Airport Jobs : ‘ఎయిర్‌పోర్ట్స్’‌లో 119 జాబ్స్.. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు

Airport Jobs : కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) 119 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

  • Written By:
  • Updated On - December 25, 2023 / 12:48 PM IST

Airport Jobs : కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) 119 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటిలో జూనియర్​ అసిస్టెంట్ ​(ఫైర్​ సర్వీస్​) పోస్టులు 73, సీనియర్​ అసిస్టెంట్​(ఎలక్ట్రానిక్స్​) పోస్టులు 25,  సీనియర్​ అసిస్టెంట్​(అకౌంట్స్​) పోస్టులు 19, జూనియర్​ అసిస్టెంట్​(ఆఫీస్​) పోస్టులు 02 ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసినవారు జూనియర్​ అసిస్టెంట్ (ఆఫీస్​), సీనియర్​ అసిస్టెంట్​ (అకౌంట్స్​) పోస్టులకు అర్హులు. జూనియర్​ అసిస్టెంట్​ (ఫైర్​ సర్వీస్​) పోస్టులకు 10వ తరగతి, ఇంటర్​, మెకానికల్/​ ఆటోమొబైల్​/ ఫైర్ డిప్లొమా హోల్డర్లు, హెచ్ఎంవీ, ఎల్ఎంవీ లైసెన్సు కలిగిన వారు అర్హులు. సీనియర్​ అసిస్టెంట్​ (ఎలక్ట్రానిక్స్​) పోస్టులకు ఎలక్ట్రానిక్స్, టెలికమ్యునికేషన్ ​/రేడియో ఇంజినీరింగ్ డిప్లొమా కలిగిన వారు(Airport Jobs) అర్హులు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. అయితే కొన్ని వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపులు కల్పిస్తారు. ఎస్​సీ, ఎస్​టీ, దివ్యాంగులు, ఎక్స్​- సర్వీస్​మెన్​, మహిళా అభ్యర్థులకు అప్లికేషన్  ఫీజు లేదు. మిగతా కేటగరీల అభ్యర్థులు రూ.1000 అప్లికేషన్ ఫీజుగా కట్టాలి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 26. పూర్తి వివరాల కోసం ఏఏఐ అధికారిక వెబ్​సైట్ ​www.aai.aeroను అభ్యర్థులు చూడొచ్చు.  ఈ వెబ్‌సైట్ హోంపేజీలో కనిపించే కెరీర్​ ట్యాబ్​పై క్లిక్ చేసి.. AAI సౌత్ రీజియన్​లో కనిపించే Direct Recruitment for ​Jr.Asst (Fire Service) under SRD, Jr. Asst (Office), Sr.Asst(Electronics), Sr.Asst(Accounts) ​ లింక్​పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Also Read: Kavitha Vs Rahul Gandhi : రాహుల్.. హిందువులకు, హిందీకి వ్యతిరేకం కాదని నిరూపించుకోండి : కవిత