Site icon HashtagU Telugu

100 Lord Ram Idols : శ్రీరాముడి 100 విగ్రహాలతో అయోధ్యలో శోభాయాత్ర.. ఎప్పుడు ?

100 Lord Ram Idols

100 Lord Ram Idols

100 Lord Ram Idols : జనవరి 22న నవ్య భవ్య అయోధ్య రామమందిరంలో అంగరంగ వైభవంగా శ్రీరాముడి ప్రతిష్ఠాపనోత్సవం జరగబోతోంది. ఈ మహా ఘట్టానికి వారం రోజుల ముందు (జనవరి 17న) అయోధ్యలో భారీ శోభాయాత్రను నిర్వహించనున్నారు. శ్రీరాముడి జీవితంలోని వివిధ దశలను కళ్లకు కట్టేలా.. శ్రీరాముడి 100  విగ్రహాలను ప్రదర్శిస్తూ ఈ శోభాయాత్ర జరుగుతుంది. వారం రోజులపాటు జరిగే రామ్​లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనా మహోత్సవాలకు ఈ శోభాయాత్రతోనే శ్రీకారం చుట్టనున్నారు. శ్రీరాముని జననం, వనవాసం, లంకపై విజయం, అయోధ్యకు తిరిగి రావడం వంటి కీలక ఘట్టాలను ప్రతిబింబించేలా శ్రీరాముడి విగ్రహాలు(100 Lord Ram Idols) ఉంటాయని ప్రధాన శిల్పి రంజిత్ మండల్​ తెలిపారు. ఇప్పటికే 60 విగ్రహాల తయారీ పూర్తయిందని వెల్లడించారు.  ఈ విగ్రహాలను తయారు చేసే అవకాశం తనకు లభించడాన్ని గొప్ప అదృష్టంగా ఆయన అభివర్ణించారు.

We’re now on WhatsApp. Click to Join.

నూతనంగా నిర్మించిన అయోధ్య రామమందిర గర్భగుడిలో జనవరి 22న రామ్​లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. పాలరాతితో చేసిన తామరపుష్ప సింహాసనంపై రామ్​ లల్లా కొలువుతీరుతారు. ఈ వేడుకకు ప్రధాని మోడీతో పాటు వందలాది మంది ప్రముఖులు హాజరవుతారు. ఇక అయోధ్య రామమందిరం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి మరో మూడేళ్లు పడుతుందని శ్రీరామ జన్మభూమి మందిర్ ట్రస్ట్ కార్యదర్శి మహంత్ గోవింద్​ గిరిదేవ్ వెల్లడించారు.

Also Read: YSR Law Nestham : యువ న్యాయవాదుల అకౌంట్స్‌లోకి డబ్బులు ఇవాళే