Site icon HashtagU Telugu

Chia Seeds : ఈ రెసిపీస్‌తో త్వరగా బరువు తగ్గుతారట..!

Chia Seeds Super Foods

Chia Seeds Super Foods

సూపర్ ఫుడ్స్ (Super Foods) గురించి మాట్లాడినప్పుడు చియా సీడ్స్ (Chia Seeds) కూడా ఉంటాయి. ఇవి అత్యంత పోషక పదార్థాలలో ఒకటి. జెల్ లాంటి ఈ సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. మీ గుండె నుండి మెదడు వరకు మీ శక్తిని పెంచడం వరకూ చియా సీడ్స్ (Chia Seeds) ఎన్నో బెనిఫిట్స్‌ ని కలిగి ఉన్నాయి. సూపర్ ఫుడ్స్ (Super Foods) లో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని మిగతా ఆహారాలతో కలిపి తినొచ్చు.

చియా సీడ్స్ (Chia Seeds) ఫైబర్ రిచ్‌ (Fiber Rich) గా ఉంటాయి. అందువల్ల ఆకలిని అరికట్టి, బరువు తగ్గేందుకు సాయపడతాయి. అంతేకాకుండా, చియా సీడ్స్ (Chia Seeds) తీసుకోవడం వల్ల విసెరల్ ఫ్యాట్ తగ్గుతుందని అధ్యయనాలు సూచించాయి. దీనినే బెల్లీ ఫ్యాట్ అంటారు. చియా సీడ్స్ గురించి ముఖ్య విషయం ఏంటంటే.. దీనిని ఏ ఫుడ్‌లో కలిపైనా తీసుకోవచ్చు. దీనిని తినడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. బరువు తగ్గేందుకు కొన్ని చియా సీడ్స్ రెసిపీస్ ఉన్నాయి.

చియా పుడ్డింగ్:

ఓ గిన్నెలో పాలు, పెరుగు, చియా గింజలు, మాపుల్ సిరప్, ఉప్పు వేసి అన్నింటిని కలిపి 30 నిమిషాలు నానబెట్టండి. రాత్రంతా మూతపెట్టి ఫ్రిజ్‌లో పెట్టి.. మరుసటి రోజు చిక్కగా, క్రీమీగా తయారైన పుడ్డింగ్‌లో తాజా ఫ్రూట్స్ వేసి ఆరగించడమే.

ఫ్రూట్ అండ్ నట్ చియా సలాడ్:

ఓ గిన్నెలో కొబ్బరిపాలు, చియా సీడ్స్, తేనె వేసి బాగా కలపండి. 2 గంటల తర్వాత అందులో పండ్ల ముక్కలు వేయండి. గింజలను కూడా డ్రెస్సింగ్‌లా వేసి కొద్దిగా టాస్ చేయండి. ఇంకేంటి తినడమే.

ఓట్స్ చియా ఫుడ్:

ఓ గిన్నెలో ఓట్స్, చియా సీడ్స్, దాల్చిన చెక్క పొడి, ఉప్పు వేసి కలపాలి. బాదం పాలు వేసి చిన్న మంటమీద ఉడకనివ్వండి. ఓట్స్ మెత్తగా ఉడికాక తేనె, పండ్ల ముక్కలు, నట్స్ వేయాలి. అంతే రెడీ.

చియా డీటాక్స్ డ్రింక్:

ఓ గిన్నెలో చియా సీడ్స్, నీరు వేయండి. పుదీనా ఆకులు, నిమ్మరసం, తేనె కలపండి. ఇది 20 నుంచి 30 నిమిషాల తర్వాత పదార్థాలన్నీ మరోసారి కలపండి. అది కొద్దీగా జెల్లీలా తయారవుతుంది. దీనిని తాగడమే.

Also Read:  Weight Loss: చలికాలంలో త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా?