Site icon HashtagU Telugu

Yoghurt vs Buttermilk : పెరుగు, మజ్జిగ.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది మీకు తెలుసా?

Yoghurt, Buttermilk.. Do You Know Which One Is Better For Health..

Yoghurt, Buttermilk.. Do You Know Which One Is Better For Health..

Curd vs Buttermilk : మాములుగా పాలు పాల పదార్థాలు అయిన పెరుగు, మజ్జిగ లాంటి వాటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. చాలామందికి అన్నం తినేటప్పుడు మజ్జిగ (Buttermilk), లేదా పెరుగు (Yoghurt) లేకుండా తినడం కంప్లీట్ అవ్వదు. అయితే ఈ మజ్జిగ, పెరుగు (Curd) వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మరి ఈ రెండిటిలో ఆరోగ్యానికి ఏది మంచిది అంటే మాత్రం చెప్పడం చాలా కష్టం. అయితే మాములుగా పెరుగు (Curd) నుంచి మజ్జిగ (Buttermilk) వస్తుంది అన్న విషయం తెలిసిందే. అయినా కూడా ఈ రెండింటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగు (Yoghurt) నుంచి వచ్చిన మజ్జిగ మాత్రం శరీరాన్ని చల్ల భరుస్తుంది. మజ్జిగ అన్ని విధాలుగా శరీరానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పెరుగు కంటే మజ్జిగ చాలా మంచిది.

We’re now on WhatsApp. Click to Join.

పెరుగు కొవ్వు బలాన్ని పెంచుతూ ఉంటాయి. వాత తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇంకా పెరుగును అందరు తీసుకోలేరు. పెరుగు బదులు దాని నుండి వచ్చే మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మంచిది. మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి, పింకు సాల్టు కొత్తిమీర వేసి తీసుకుంటే రుచి చాలా గొప్పగా ఉంటుంది. ఇంకా మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది న్యాయం చేసింది. జీర్ణక్రియను మెరుగుపడేలా చేస్తుంది. అలాగే జీర్ణ సమస్యలు, వాపు సమస్యలు రక్తహీనత ఆకలి లేకపోవడం అలాంటి సమస్యలనుంచి ఉపశమనం కలుగుతుంది. శీతాకాలంలో అయితే అజీర్ణం సమస్య ఎదురవకుండా నివారిస్తుంది. మజ్జిగ తేలికగా ఉండడం వల్ల జీర్ణమవ్వడం చాలా ఈజీ. ఆకలి ప్రేరేపించడానికి బాగా ఉపయోగపడుతుంది. అదే పెరుగు తీసుకుంటే జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. మలబద్ధకం, గ్యాస్ట్రిక్ లేదా ఆక్సిడెంట్ లాంటి జీర్ణ సమస్యలు ఉంటే మజ్జిగ చక్కని ఎంపిక. ఇంకా మజ్జిగ శరీర బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

బరువు పెరగాలంటే పెరుగు బరువు తగ్గాలంటే మజ్జిగ తీసుకోవాలి. అయితే ఊబకాయం, కఫా రుగ్మతలు, రక్తస్రావం, వాపు ఆర్థరైటిస్ ఉన్నవాళ్లు పెరిగికి దూరంగా ఉండాలి. రాత్రి సమయంలో పెరుగు తినకూడదు. ఎందుకంటె ఇది దగ్గు సైనస్, జలుబు లాంటి సమస్యలను ఎక్కువ అయ్యేలా చేస్తుంది. ఒకవేళ రాత్రి సమయంలో పెరుగు తినకుండా ఉండలేని అనుకుంటే అందులో చిటికెడు మిరియాలు లేదా మెంతులు వేసుకొని తినడం మంచిది. పెరుగు వేడి చేయడం వలన దాంట్లోనే మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. చాలామంది పెరిగిన వేడి చేసి మజ్జిగ చారు లాంటివి చేస్తూ ఉంటారు. అయితే అది తరచూ తింటున్న వారి శరీరంపై మాత్రమే తట్టుకోగలరు.

Also Read:  Garlic Tea: చలికాలంలో అలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే వెల్లుల్లి టీ తాగాల్సిందే?