World’s Rarest Blood Groups : ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపు ఏదో మీకు తెలుసా..?

ఎవరైనా మీ బ్లడ్ గ్రూపు (Blood Group) ఏది అని అడిగితే వెంటనే A+, A-, B+, B-, O+, O-, AB+, AB- అని చెప్పేస్తాం. అయితే.. వీటితో పాటు మరో రెండు బ్లడ్ గ్రూపులున్నాయని (World’s Rarest Blood Groups) మనలో చాలామందికి తెలియదు. ఆ బ్లడ్ గ్రూపు ఉన్నవాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగి రక్తం కావాలంటే ఆ రక్తం దొరికే పరిస్థితి దాదాపు లేనట్లే. ఎందుకంటే ఆ అరుదైన బ్లడ్ గ్రూపు ఉన్నవారిలో […]

Published By: HashtagU Telugu Desk
Blood Type-Health Risks

Blood Type-Health Risks

ఎవరైనా మీ బ్లడ్ గ్రూపు (Blood Group) ఏది అని అడిగితే వెంటనే A+, A-, B+, B-, O+, O-, AB+, AB- అని చెప్పేస్తాం. అయితే.. వీటితో పాటు మరో రెండు బ్లడ్ గ్రూపులున్నాయని (World’s Rarest Blood Groups) మనలో చాలామందికి తెలియదు. ఆ బ్లడ్ గ్రూపు ఉన్నవాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగి రక్తం కావాలంటే ఆ రక్తం దొరికే పరిస్థితి దాదాపు లేనట్లే. ఎందుకంటే ఆ అరుదైన బ్లడ్ గ్రూపు ఉన్నవారిలో ప్రపంచం మొత్తం మీద 9 మంది మాత్రమే ఉన్నారు.

సాధారణంగా మనిషి రక్తం A, B, AB, O గ్రూపులుగా ఉంటుంది. ఎర్ర రక్త కణాలపై ఉండే యాంటిజన్ల ఆధారంగా ఈ గ్రూపులను నిర్ణయిస్తారు. A- యాంటిజన్ ఉంటే A గ్రూపు, B-యాంటిజన్ ఉంటే B గ్రూపు, రెండూ ఉంటే AB గ్రూపు, అవేవీ లేకపోతే O గ్రూపుగా పరిగణిస్తారు. అలాగే ఎర్ర రక్త కణాలపై RH ప్యాక్టర్ ఉంటే పాజిటివ్‌గా లేకపోతే నెగిటివ్‌గా భావిస్తారు. అంటే ఎర్ర రక్త కణాలపై యాంటిజన్‌తో పాటు RH ఫ్యాక్టర్ కూడా ఉంటే అది పాజిటివ్, లేకపోతే అది నెగిటివ్ అంటారు. AB పాజిటివ్, AB నెగిటివ్, O నెగిటివ్ బ్లడ్ గ్రూపులతో పాటు మరో రెండు అత్యంత అరుదైన గ్రూపులు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి బాంబే బ్లడ్ గ్రూపు కాగా, రెండోది గోల్డెన్ బ్లడ్ గ్రూపు.

బాంబే బ్లడ్ గ్రూపు (Bombay Blood Group) అనేది..

అన్ని బ్లడ్ గ్రూపులు ఇంగ్లిష్ అల్ఫాబెట్స్ ఎ, బి, ఓ లాంటి పేర్లతో ఉంటాయి. కానీ ఈ బ్లడ్ గ్రూప్ ఒక నగరం పేరుతో ఉంది. దీని వెనుక ఒక కారణం ఉంది. మొట్టమొదట 1952లో దీనిని భారత్‌లోని మహారాష్ట్ర రాజధాని బాంబేలో గుర్తించారు. వైఎం భెండె ఈ గ్రూప్ రక్తం కనుగొన్నారు. అసలు ఈ గ్రూపు ఒకటి ఉందన్న విషయం కూడా చాలా తక్కువ మందికే తెలుసు.

చివరకు ఆ గ్రూపు రక్తం ఉన్న వారు తమది ‘O’ గ్రూపు రక్తం అనుకుంటూ ఉంటారు. కానీ రక్తదానం తర్వాత ఆ రక్తాన్ని’O’ గ్రూపు వారికి ఎక్కిస్తున్నప్పుడు వారికి మ్యాచ్ కానప్పుడు, ప్రత్యేక పరీక్షల ద్వారా మాత్రమే వారి బ్లడ్ గ్రూపు ఏంటో తెలుస్తుంది. ఇది కేవలం ప్రతి 10 వేల మందిలో ఒక్కరిలో మాత్రమే ఉంటుంది.

గోల్డెన్ బ్లడ్ గ్రూపు (Golden Blood Group) అనేది..

రెండవదైన గోల్డెన్ బ్లడ్ గ్రూపు (Golden Blood Group) కలిగిన వ్యక్తులు ప్రపంచం మొత్తం మీద కేవలం 100 మంది మాత్రమే ఉంటారని అంచనా. ఈ బ్లడ్ గ్రూపును తొలిసారిగా 1961లో ఆస్ట్రేలియాకు చెందిన మహిళలో గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో 43 మందిలో మాత్రమే ఈ రక్తం ఉందని వెల్లడైంది. కాబట్టి ఈ రక్తం ప్రపంచంలో అత్యంత విలువైనది, ప్రమాదమైనది కూడా. ఈ రక్తం కలిగిన వారికి రక్తం అవసరమైనప్పుడు దాతలు దొరకడం అత్యంత కష్టమైన పని. ఈ బ్లడ్ గ్రూపు వారిని విశ్వదాతలు అంటారు. వీళ్లు ఎవరికైనా రక్తం ఇవ్వొచ్చు. ఎందుకంటే ఈ గ్రూపు రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో Rh యాంటిజెన్ ఉండదు.దీంతో పాజిటివ్, నెగటివ్ బ్లడ్ గ్రూప్‌లతో సంబంధం లేకుండా అందరికి గోల్డెన్ బ్లడ్ గ్రూపు వారి రక్తాన్ని ఎక్కించవచ్చు. అతి తక్కువ మందిలో ఉండే ఈ బ్లడ్ గ్రూపు కలిగినవారు ఏ దేశంలో ఎంతమంది ఉన్నారో కనిపెట్టడం చాలా కష్టం. ఈ రక్తాన్ని నిల్వ చేసే కేంద్రాలు ఎక్కడైనా ఉన్నాయా అనేది కూడా ఎవరికీ పెద్దగా తెలియలేదు.

Read Also :  MLA Yashaswini Reddy : అందరి చేత శభాష్ అనిపించుకుంటున్న పాలకుర్తి ఎమ్మెల్యే..

  Last Updated: 08 Jan 2024, 09:05 PM IST