Site icon HashtagU Telugu

Expensive Cheese: కిలో జున్నుతో బంగారం కొనొచ్చు, కిలో ఎంతో తెలుసా?

Most Expensive Paneer

Most Expensive Paneer

Expensive Cheese: చాలా మందికి జున్ను అంటే ఇష్టం ఉండే ఉంటుంది. చీజ్ శాఖాహారులకు మంచి ప్రోటీన్ గా పరిగణించబడుతుంది. ప్రొటీన్‌తోపాటు విటమిన్‌ బి, క్యాల్షియం, నైట్రోజన్‌ వంటి పోషకాలు చీజ్‌లో ఉంటాయి. ఇప్పటి వరకు మీరు 250 గ్రాముల పనీర్‌కు గరిష్టంగా రూ. 100, 120 ఖర్చు చేసి ఉండవచ్చు. లేదా 1 కిలో పనీర్ కోసం 500 లేదా 600 రూపాయలు ఖర్చు చేసి ఉంటారు. కానీ కిలో జున్ను ధర వేలల్లో ఉంటుంది అంటే నమ్ముతారా. ఈ చీజ్ ధరతో పోలిస్తే, బంగారం చౌకగా అనిపించవచ్చు.

చాలా మంది జున్ను (Cheese) తినడానికి ఇష్టపడతారు. కానీ ఎప్పుడైనా గాడిద పాల (donkey milk) చీజ్ తిన్నారా? సెర్బియాలోని జెసావికాలో గాడిద పాలతో జున్ను తయారు చేస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఇక్కడ తయారవుతోంది. గాడిద పాలతో తయారు చేసిన జున్ను కిలో రూ.78,800కు విక్రయిస్తున్నారు. 25 కిలోల గాడిద పాలు ఒక కిలో జున్ను ఉత్పత్తి చేస్తుంది. దీని రుచి గొర్రెల పాల చీజ్‌ని పోలి ఉంటుంది.

గాడిద పాలతో చేసిన జున్ను చాలా రుచిగా ఉంటుంది. ఈ జున్ను చాలా మృదువైనది, క్రీములా ఉంటుంది. దీని రుచి కొద్దిగా ఉప్పగా అనిపిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా కూడా పరిగణించబడుతుంది. మనం గాడిద పాలను ఆవు పాలతో పోల్చి చూస్తే, అందులో అత్యధిక ప్రొటీన్లు లభిస్తాయి, అందుకే దాని పాలతో తయారు చేసిన జున్ను కూడా చాలా ఖరీదైన ధరకు అమ్ముడవుతోంది.

Also Read: Tirumala Laddu Controversy : పవన్ ఫై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి