Mental Health Day 2024 : ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ గురువారం (అక్టోబరు 10న) జరగబోతోంది. మనకు శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. మానసిక ఆరోగ్యం అంతకంటే ఎక్కువ ముఖ్యం. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు ఇలా ప్రతి ఒక్కరికి మానసిక ఒత్తిడి ఉంటుంది. మెదడుపై పడే ఒత్తిడినే మానసిక ఒత్తిడిగా పిలుస్తారు. దీన్ని తగ్గించుకోగలిగితే మనం ప్రశాంతంగా జీవించవచ్చు.
Also Read :Tata – BMW : టాటాతో చేతులు కలిపిన బీఎండబ్ల్యూ.. ఏం చేయబోతున్నాయంటే..
మన మెదడులో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల మానసిక సమస్యలు వస్తుంటాయి. కుటుంబ వారసత్వం, దీర్ఘకాలిక ఒత్తిడి, శారీరక సమస్యల వల్ల కూడా మానసిక ఒత్తిడి పెరుగుతుంటుంది. ఈ సమస్య స్త్రీ, పురుష బేధం లేకుండా అందరికీ వస్తుంది. మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న చాలామంది సరిగ్గా నిద్రపట్టదు. ఇందుకోసం వైద్యుల నుంచి మందులను తీసుకొని వాడుతుంటారు. అయితే నిద్ర వచ్చే మాత్రలను అతిగా వాడటం అనర్ధ దాయకం. ఎప్పటికప్పుడు డాక్టర్ల సూచనలు తీసుకోవాలి. మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చిన వాళ్లు.. ఆయా సమస్యలు తగ్గే వరకు మందులు(Mental Health Day 2024) వాడితే సరిపోతుంది.
Also Read :Train Accident : రైలు పట్టాలపై సిమెంటు దిమ్మెలు.. తప్పిన పెను ప్రమాదం
మానసిక వ్యాధుల గురించి..
- డిప్రెషన్ అనేది ఒక మానసిక సమస్య. దీనివల్ల మనిషికి పనులపై శ్రద్ధ ఉండదు. నెగెటివ్ ఆలోచనలే వస్తుంటాయి. వేళకు ఆకలి కాదు. ఒంటరితనంగా ఫీలవుతారు.
- యాంగ్జైటీ అనేది ఒక మానసిక సమస్యే. ఇది వచ్చిన వారిలో కంగారు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది. అకస్మాత్తుగా చనిపోతాననే ఆలోచనలు వస్తాయి. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నా.. తనకు ఏమైపోతుందో అనే బెంగ లోలోపల వెంటాడుతుంది.
- స్కిజోఫ్రినియా ఉన్న వాళ్లు వారిలో వాళ్లే మాట్లాడుకుంటారు. చుట్టూ ఉన్న వారు తమ గురించే మాట్లాడుకుంటున్నారనే అపోహలో కాలం గడుపుతారు.
- మానసిక వ్యాధులను ఆదిలోనే గుర్తిస్తే తక్కువస్థాయిలో లక్షణాలు ఉండగానే కౌన్సెలింగ్ ద్వారా తగ్గించవచ్చు.
- ఈ వ్యాధులు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు కౌన్సెలింగ్ ద్వారా నయం చేయలేం. సైక్రియాటిస్ట్, సైకాలజిస్ట్ ద్వారా వైద్య సలహా పొందాలి.