Mouth Cancer : రోజూ డ్రింక్స్ తాగే మహిళలకు నోటి క్యాన్సర్ ముప్పు

Mouth Cancer : రోజువారీ మద్యం సేవనంతో నోటిలోని కణజాలం దెబ్బతిని క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం అధికంగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది

Published By: HashtagU Telugu Desk
Oral Cancer

Oral Cancer

అంతర్జాతీయంగా నిర్వహించిన తాజా పరిశోధనల ప్రకారం రోజూ డ్రింక్ (Drinks తాగే మహిళలకు నోటి క్యాన్సర్ (Mouth Cancer) వచ్చే ప్రమాదం ఐదింతలు అధికంగా ఉంటుందని ‘యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్’ శాస్త్రవేత్తలు తేల్చారు. ముఖ్యంగా ధూమపానం అలవాటు లేకున్నా, కేవలం మద్యపానం చేయడం వల్లనే నోటి క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని వారు తెలిపారు. రోజువారీ మద్యం సేవనంతో నోటిలోని కణజాలం దెబ్బతిని క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం అధికంగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది.

Copy Vs Inspire : పాటల కాపీయింగ్ వర్సెస్ ఇన్‌స్పైర్‌ కావడం.. దేవిశ్రీ ప్రసాద్‌ సంచలన కామెంట్స్

2020లో ప్రపంచవ్యాప్తంగా 3.55 లక్షల మంది నోటి క్యాన్సర్‌(Mouth Cancer)కు గురయ్యారని నివేదిక తెలిపింది. ఇందులో అత్యధిక శాతం యువతులే ఉండటం అనేక ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో పెద్ద వయసు వారిలో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి, ఇప్పుడు యువతలో కూడా పెరుగుతుండటం ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు ప్రధాన కారణాలని అధ్యయనం స్పష్టం చేసింది. ముఖ్యంగా, ఆల్కహాల్ సేవించే మహిళల్లో ఈ రిస్క్ మరింత అధికంగా ఉందని పేర్కొంది.

Janasena Formation Day : మరోసారి జనసేన శ్రేణులను నిరాశ పరిచిన పవన్

నోటి క్యాన్సర్ (Mouth Cancer) ముప్పును తగ్గించుకోవాలంటే మద్యపానాన్ని పూర్తిగా మానుకోవడం లేదా తగ్గించుకోవడం అత్యవసరం. అంతేకాదు ధూమపానం, పొగతాగే ఇతర పదార్థాల నుండి కూడా దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, శారీరక వ్యాయామం చేయడం, నోటికి సరైన శుభ్రత పాటించడం ద్వారా క్యాన్సర్ అవకాశాలను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మద్యం వల్ల నోటి క్యాన్సర్ మాత్రమే కాకుండా, లివర్, గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

  Last Updated: 15 Mar 2025, 12:05 PM IST