Winter Immunity Boosters: చలికాలం వచ్చింది అంటే చాలు సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దగ్గు జలుబు జ్వరము ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అయితే వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు ఇలాంటి సమస్యలు రావడం సహజమే అయినప్పటికీ ఇటువంటివి రాకుండా ఉండాలి అంటే ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. మరి చలికాలంలో ఎలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవడం కోసం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చలికాలంలో తులసిని రోజూ ఐదు ఆకులు పరగడుపున ప్రతి ఉదయం తింటే చాలామంచిదట. తులసి శ్వాసకోశంలో కణాలకు వచ్చే వైరస్లను నిరోధిస్తుందట. అల్లం, నల్ల మిరియాలతో కలిపి తీసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయట. అలాగే పచ్చి ఆకులను నమలడం కూడా మంచిదే అని చెబుతున్నారు. పసుపును పాలలో వేసి తాగితే మంచిదట. కానీ దానిని సరైన విధంగా తాగాలంటే దానిలో నల్ల మిరియాలు కూడా వేసుకోవచ్చని అప్పడే శరీరం కర్కుమిన్ తీసుకోగలుగుతుందని చెబుతున్నారు.
రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందట. నిద్రపోయే ముందు తాగాలనుకుంటే జాజికాయ కూడా వేసుకోవచ్చట. ఈ జాజికాయ దగ్గును తగ్గించడం నుంచి నిద్రపోయేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా అల్లం తాజాగా తురిమి తేనెతో కలిపి తీసుకోండి. అలాగే వాము వాసన థైమోల్ విడుదల చేస్తుంది. ఇది ఆసుపత్రి స్థాయి క్రిమిసంహారక మందులలో ఉండే పదార్థం. వారానికి ఒకసారి దీని ఆవిరి పట్టడం వల్ల సైనస్ సమస్య తగ్గుతుందట. శ్లేష్మ పొరలను బలంగా చేస్తుందని, మొత్తం శ్వాసకోశ వ్యవస్థను ఇన్ఫెక్షన్ల నుంచి తప్పిస్తుందని చెబుతున్నారు. అశ్వగంధ రోగనిరోధక శక్తిని అందిస్తుందట. నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలతో మూడు వారాలు తీసుకుంటే మంచిదని, ఫ్లూ, జలుబు, దగ్గు వంటి ఇబ్బందులను ఇది దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉసిరిలో నారింజ కంటే ఇరవై రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుందట. ఇది టానిన్లు రక్షిస్తాయి. కాబట్టి వేడిని తట్టుకుంటుందని, తాజాగా ఉన్నా ఎండబెట్టినా ఊరగాయ రూపంలోనైనా తీసుకోవచ్చని చెబుతున్నారు. మొత్తం పండు, విడిగా ఉన్న విటమిన్ సి కంటే బాగా పనిచేస్తుందట.
Winter Immunity Boosters: చలికాలంలో జలుబు దగ్గు వంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
Winter Immunity Boosters: చలికాలంలో వచ్చే దగ్గు జలుబు వంటి వాటికి దూరంగా ఉండాలంటే ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.అలాగే ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Winter Immunity Boosters
Last Updated: 10 Dec 2025, 08:11 AM IST