భారతీయ పురుషులు వయసు కంటే ముందే ఎందుకు ముసలివారిలా కనిపిస్తారు?

చెప్పిన దాని ప్రకారం.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి తగినంత ప్రోటీన్ అందకపోతే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. శరీర ఆకృతి దెబ్బతింటుంది.

Published By: HashtagU Telugu Desk
Why Men Look Older

Why Men Look Older

Why Men Look Older: భారతీయ పురుషులను విదేశీ పురుషులతో పోల్చి చూస్తే ఒక 30 ఏళ్ల భారతీయ వ్యక్తికి అదే వయసున్న విదేశీ వ్యక్తికి మధ్య చాలా తేడా కనిపిస్తుంది. భారతీయ పురుషులలో 30 ఏళ్లకే జుట్టు రాలడం, పొట్ట రావడం వంటి లక్షణాల వల్ల వారు 40 ఏళ్ల వారిలా కనిపిస్తుంటారు. అసలు భారతీయ పురుషులు వయసు కంటే ముందే ముసలివారిలా ఎందుకు కనిపిస్తారు? అయితే భారతీయ పురుషులు త్వరగా వృద్ధాప్య ఛాయలు రావడానికి గల కారణాలను తెలుసుకుందాం. మీరు కూడా అదే తప్పులు చేస్తున్నారేమో ఒకసారి చూసుకోండి.

భారతీయ పురుషులు వయసు కంటే ముందే ఎందుకు ముసలివారిలా కనిపిస్తారు?

నిపుణుల ప్రకారం.. యూరప్‌లోని 30 ఏళ్ల పురుషులు చాలా యంగ్‌గా కనిపిస్తారు. కానీ అదే వయసున్న భారతీయులు మాత్రం అప్పుడే ‘అంకుల్’ లా కనిపిస్తుంటారు. దీనికి ప్రధాన కారణాలు మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు.

శారీరక శ్రమ లేకపోవడం: భారతీయ పురుషులు రోజంతా ఆఫీసుల్లో కూర్చుని పని చేస్తారు. ఎలాంటి శారీరక శ్రమ ఉండదు.

తప్పుడు ఆహారపు అలవాట్లు: సాయంత్రం స్నాక్స్‌గా సమోసాలు, కచోరీలు వంటి నూనెలో వేయించిన పదార్థాలు ఎక్కువగా తింటారు. దీనికి తోడు రోజుకు కనీసం మూడు సార్లు టీ తాగుతుంటారు.

Also Read: కేంద్ర బ‌డ్జెట్ 2026.. ఆటో మొబైల్ రంగానికి భారీగా కేటాయింపులు!

అధిక కార్బోహైడ్రేట్లు: రాత్రి ఇంటికి వెళ్ళాక తినే భోజనంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు చాలా తక్కువగా ఉంటాయి.

చెప్పిన దాని ప్రకారం.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి తగినంత ప్రోటీన్ అందకపోతే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. శరీర ఆకృతి దెబ్బతింటుంది. ఎనర్జీ లెవల్స్ తగ్గిపోతాయి. ఈ సమస్యను ఏ మందులు తక్షణమే నయం చేయలేవు. కేవలం మీ అలవాట్లను మార్చుకోవడం ద్వారానే దీనిని సరిదిద్దుకోగలరు.

వయసు కంటే ముందే ముసలితనం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఆహార నియంత్రణ: మీ ఆహారాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. బయటి జంక్ ఫుడ్‌ను వీలైనంత వరకు తగ్గించండి.

ప్రోటీన్ పెంచండి: మీ రోజువారీ ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి.

వ్యాయామం: వారానికి కనీసం 4 సార్లు జిమ్‌కు వెళ్లడం లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల శరీరంలో అదనపు కొవ్వు చేరదు. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీరు మీ వయసుకి తగ్గట్టుగా యంగ్‌గా, ఉత్సాహంగా కనిపిస్తారు.

  Last Updated: 02 Feb 2026, 08:24 PM IST