Mosquito : దోమలు ఎక్కువగా కొంతమందిని కుడుతుంటాయి ఎందుకో మీకు తెలుసా?

దోమలు(Mosquitos) ఎక్కువగా కొంతమందిని మాత్రమే కుడుతుంటాయి. వారి చుట్టూ ఎక్కువగా దోమలు తిరుగుతుంటాయి. మిగిలిన వాళ్ళని తక్కువగా కుడతాయి.

  • Written By:
  • Publish Date - October 18, 2023 / 08:43 PM IST

సాయంత్రం సమయంలో ఆరుబయట కూర్చుంటే దోమలు(Mosquitos) ఎక్కువగా కొంతమందిని మాత్రమే కుడుతుంటాయి. వారి చుట్టూ ఎక్కువగా దోమలు తిరుగుతుంటాయి. మిగిలిన వాళ్ళని తక్కువగా కుడతాయి. దానికి కొన్ని రకాల సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. వాటిలో మొదట వారి శరీరం నుండి వెలువడే వాసన. ఎవరి శరీరంలో అయితే యూరిక్ ఆసిడ్, లాక్టిక్ ఆసిడ్, అమ్మోనియా ఎక్కువగా ఉంటాయో వారి శరీరం నుండి ఒక రకమైన వాసన వస్తుంది. ఇంకా చెమట ఎక్కువగా పట్టే వారి నుండి వచ్చే దుర్వాసన కు కూడా దోమలు ఎక్కువగా ఆకర్షించబడి వారినే దోమలు ఎక్కువగా కుడుతుంటాయి.

అలాగే మనం వేసుకునే దుస్తుల రంగులను బట్టి కూడా దోమలు ఆకర్షించబడతాయి. మనం ముదురు రంగు బట్టలు వేసుకుంటే దోమలు ఎక్కువగా కుడతాయి అంటే నలుపు, ఎరుపు, పచ్చ వంటి వాటికి దోమలు ఎక్కువగా ఆకర్షించబడతాయి. మనం లేతరంగు దుస్తులు వేసుకుంటే మనల్ని దోమలు కుట్టవు.

రోజూ ఆల్కహాల్ తాగే వారిని కూడా దోమలు ఎక్కువగా కుడుతుంటాయి. ఎందుకంటే దోమలు ఆల్కహాల్ వాసనకు ఎక్కువగా ఆకర్షించబడతాయి.

మన శరీరంలో చర్మం పైన వివిధ రకాల సూక్ష్మజీవులు నివసిస్తుంటాయి. మన పాదాల కింద సూక్ష్మజీవులు ఎక్కువగా నివసిస్తే బ్యాక్టీరియా తయారయ్యి దోమలను ఆకర్షింపజేస్తాయి. కాబట్టి దోమలు ఎక్కువగా కుట్టకుండా ఉండాలంటే మన శరీరాన్ని క్లీన్ గా ఉంచుకోవాలి. మనం నీరు ఎక్కువగా తాగుతుండాలి దీని వలన మన శరీరం నుండి వెలువడే చెమట దుర్వాసన రాకుండా ఉంటుంది. మనం రాత్రిపూట ధరించే దుస్తులు లేత రంగును కలిగి ఉండడం వలన కూడా రాత్రి పూట దోమలు కుట్టకుండా ఉంటాయి. కాబట్టి మనం ఇవి పాటిస్తే మనల్ని దోమలు ఎక్కువగా కుట్టకుండా ఉంటాయి.

 

Also Read : Don’t Drink Water : ఈ ఆహారాలు తిన్న వెంటనే మంచినీరు తాగకూడదట.. ఎందుకంటే ?