Site icon HashtagU Telugu

Rice: తెలుపు, గోధుమ, ఎరుపు, నలుపు రంగుల రైస్ లో.. ఏది బెస్ట్?

Sugar Patients

Sugar Patients

బియ్యం (Rice) అంటే మనకు బాగా తెలిసింది తెల్ల బియ్యమే. కానీ గోధుమ, ఎరుపు, నలుపు రంగుల బియ్యం కూడా ఉంటుంది. ఇవి ఒక్కొక్కటి ఒక్కో రకమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఒక్కో దాంట్లో ఒక్కో విధమైన పోషకాలు ఉన్నాయి. అవేమిటో తెలిస్తేనే .. వేటిని ఎప్పుడు వాడాలి.. ఎంత వాడాలి.. ఆరోగ్య ప్రయోజనం ఎలా పొందాలి అనే దానిపై మనకు అవగాహన పెరుగుతుంది. చాలా మంది బ్రౌన్ రైస్, రెడ్ రైస్ , బ్లాక్ రైస్ (Rice) లను మనం సాధారణంగా వినియోగించే వైట్ రైస్‌కి ప్రత్యామ్నాయాలుగా భావిస్తుంటారు. మీకు ఏ వెరైటీ బాగా సరిపోతుందో అర్థం చేసుకోవాల్సింది మీరే. ఇందుకోసం డైటీషియన్‌ సలహా కూడా తీసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

తెల్ల బియ్యం (White Rice):

ప్రపంచవ్యాప్తంగా వినియోగించే అత్యంత సాధారణ రకం బియ్యం తెలుపు బియ్యం. ఇతర రకాలతో పోలిస్తే, వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. వరి ధాన్యంపై ఉండే ఊక, పొట్టు పొరలను తొలగించాక పాలిష్ చేసిందే తెల్ల బియ్యం. ఇందులో ఫైబర్ తక్కువగా ఉంటుంది.

తెల్ల బియ్యం (White Rice) ఎక్కువ తింటే పోషక లోపం:

తెల్ల బియ్యంతో వండే ఒక కప్పు అన్నంలో 53 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల కాల్షియం, 2.72 గ్రాముల ఐరన్, 15 గ్రాముల మెగ్నీషియం, 4.39 గ్రాముల ప్రోటీన్, 242 కేలరీలు ఉంటాయి. తెల్ల బియ్యంలో ఫోలేట్, థయామిన్ తక్కువ మొత్తంలో ఉంటుంది. దీనితో పాటు పొటాషియం, ఫాస్పరస్, ఐరన్ వంటి ఖనిజాలు అన్నంలో ఉంటాయి. అయితే విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ డి అస్సలు ఉండవు. వైట్ రైస్‌ని ఎక్కువ మోతాదులో తింటే శరీరంలో అనేక పోషకాలు లోపిస్తాయి.

టైప్ 2 డయాబెటిస్ ముప్పు ఎక్కువ:

ప్రతిరోజూ తెల్ల బియ్యం తినే వ్యక్తులకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వైట్ రైస్ దాదాపు పూర్తిగా కార్బోహైడ్రేట్లతో తయారవుతుంది. వైట్ రైస్‌లో దాదాపు 73 GI ఉంటుంది. అంటే అది తిన్నప్పుడు రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరుగుతుంది.

బ్రౌన్ రైస్ (Brown Rice):

బియ్యంపై నుంచి మనం తినలేని పొరను మాత్రమే తీసివేసి ఉంటే అది బ్రౌన్ రైస్. దీనిపై ఊక , పొట్టు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఇది గోధుమ రంగులో ఉంటుంది. దీనిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. బ్రౌన్ రైస్ అనేది వైట్ రైస్ కంటే తక్కువ పాలిష్ చేయబడి ఉంటుంది.

బ్రౌన్ రైస్ (Brown Rice) పోషకాలు ఇవీ:

మెగ్నీషియం, సెలీనియం, థయామిన్, నియాసిన్, విటమిన్ B6, ఫాస్పరస్ మరియు పొటాషియం వంటి విటమిన్లు, ఖనిజాలు ఇందులో
సమృద్ధిగా ఉంటాయి. బ్రౌన్ రైస్‌లో అపిజెనిన్, క్వెర్సెటిన్ మరియు లుటియోలిన్ వంటి ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇది తెల్ల బియ్యం కంటే కొంచెం తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. బ్రౌన్ రైస్ డయాబెటిస్‌లో కూడా HbA1cని తగ్గిస్తుందని కొన్ని స్టడీల్లో తేలింది.

ఎర్ర బియ్యం (Red Rice):

రెడ్ రైస్‌ని హిమాలయన్ లేదా భూటానీస్ రైస్ అని కూడా అంటారు. ఈ బియ్యంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది  రక్తపోటును  తగ్గిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహిస్తుంది. ఎముకలను బలపరుస్తుంది.  ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల బ్రౌన్ రైస్‌తో పోలిస్తే ఇది ఆరోగ్యకరమైనది. దంపుడు బియ్యం వేరు. ఎర్ర బియ్యం వేరు. ఆంథోక్యానిన్ అనే పదార్థం వల్ల ఈ బియ్యం ఎరుపు రంగులో ఉంటాయి. వైట్ రైస్ ఎక్కువగా తింటే.. బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. అదే రెడ్ రైస్‌ విషయంలో అలా జరగదు. చూడటానికి ఎరుపు రంగులో ఉండే ఈ బియ్యం.. తినేటప్పుడు బాదం, జీడిపప్పులా కాస్త మెత్తగా ఉంటాయి. పాలిష్ చేసిన (తెల్ల బియ్యం)తో పోల్చితే వీటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి.

రెడ్ రైస్ (Red Rice) రకాలు:

రక్తాషలీ (Raktashali), థాయ్ రెడ్ కార్గో రైస్ (Thai Red Cargo Rice), బూటాన్ రెడ్ రైస్ (Bhutanese Red Rice), ఫ్రాన్స్‌లో పండే కామార్గ్ రెడ్ రైస్ (Camargue Red Rice), కేరళలో పండే మట్టా రైస్ (Kerala Matta Rice)… ఇవన్నీ రెడ్ రైస్‌లో రకాలు. కేరళలోని పాలక్కడ్‌లో పండే మట్టా రెడ్ రైస్… శ్రీలంకలో కూడా ఫేమస్సే.

రెడ్ రైస్‌ (Red Rice) ఆరోగ్య ప్రయోజనాలు:

  1. రెడ్ రైస్‌లో ఫైబర్ బాగా ఉంటుంది. కప్పు బియ్యంలో… 8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ తక్కువ. అందువల్ల ఎర్ర బియ్యం తినేవారికి మల బద్ధకం సమస్యే ఉండదు. డయాబెటిస్, గుండె జబ్బులు, అధిక బరువు సమస్యలు రావు.
  2. ఎర్రబియ్యంలో బ్లడ్ షుగర్‌ను తగ్గించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలంటే ఎర్ర బియ్యం సరైనవి.
  3.  బ్లడ్‌లో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించే శక్తి ఎర్ర బియ్యానికి ఉంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎర్రబియ్యంలోని మెగ్నీషియం బీపీని క్రమబద్ధీకరిస్తుంది.
  4. ఎర్రబియ్యంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఆక్సిజన్ వెళ్లేందుకు ఐరన్ అవసరం. సరిగా ఐరన్ లేని బాడీ… ఆక్సిజన్‌ను సరిగా తీసుకోలేదు. ఊరికే అలసిపోతారు.
  5. ఎర్రబియ్యంలో విటమిన్ బీ6 ఉంటుంది. మన శరీరంలో ఎర్రరక్త కణాలు తయారవ్వాలంటే ఈ విటమిన్ కావాలి. మన ఆర్గాన్లు చక్కగా పనిచెయ్యాలంటే ఇది కావాలి.
  6. రెడ్ రైస్‌లో ఆంథోసియానిన్, మాంగనీస్, జింక్ ఉంటాయి. ఇవన్నీ మన బాడీలో విషవ్యర్థాల్ని వెంటపడి తరుముతాయి. ఏవైనా సూక్ష్మక్రిములు బాడీలోకి రావాలని చూస్తే.. ఎంట్రీ గేట్ దగ్గరే అడ్డుకొని బయటకు పంపేస్తాయి. అందువల్ల మన బాడీలో కణాలు హాయిగా, హ్యాపీగా ఉంటాయి. అందువల్ల మన చర్మం త్వరగా ముడుతలు పడదు.
  7. రెడ్ రైస్‌లో కాల్షియం, మాంగనీస్ ఉంటాయి. అవి ఎముకల్ని బలంగా మార్చేస్తాయి. ముసలితనంలో అస్థియోపోరోసిస్ వ్యాధి సోకదు.
  8. మెనోపాజ్ తర్వాత మహిళలు చాలా బాధ, నొప్పిని అనుభవిస్తారు. వాళ్లు ఎర్ర బియ్యం తింటే ఉపశమనం పొందుతారు. ఆస్తమా నుంచీ రిలీఫ్ పొందేందుకు కూడా ఎర్ర బియ్యం ఉపయోగపడతాయి. ఇప్పటికైతే ఆన్‌లైన్‌లో ఈ రెడ్ రైస్ కేజీ రూ.100కు పైనే ఉన్నాయి.

నల్ల బియ్యం (Black Rice):

ఈ బియ్యం తేలికపాటి, వగరు , మట్టి రుచిని కలిగి ఉంటుంది. దీనిని ‘పర్పుల్ రైస్’ అని కూడా పిలుస్తారు. ఇది విటమిన్లు, ఖనిజాలు మరియు ఆంథోసైనిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్ల యొక్క గొప్ప మూలం. దీనిలో విటమిన్ ఇ, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఈ బియ్యాన్ని వండినప్పుడు ఊదా రంగులోకి మారుతుంది. బ్లాక్ రైస్ అన్ని ఇతర రకాలతో పోలిస్తే అత్యధిక యాంటీఆక్సిడెంట్, ప్రోటీన్ మరియు డైటరీ ఫైబర్ కంటెంట్ ఉంటుంది.అయితే శుద్ధి చేయని నల్ల బియ్యం వాడితే ఆరోగ్యానికి మంచిదని డైటీషియన్స్ అంటున్నారు.

నల్ల బియ్యం (Black Rice) చరిత్ర:

పురాతన కాలంలో నల్ల బియ్యం చైనాలోని చాలా చిన్న ప్రాంతంలో సాగు చేయబడేది . ఈ బియ్యం రాజుకు మాత్రమే ఇచ్చేవారు. నేడు దాని సాగుపై ఎలాంటి పరిమితి లేనప్పటికీ, ఇప్పటికీ దాని సాగు తెలుపు మరియు గోధుమ రంగులతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. బియ్యంలో ఉండే ఆంధోసైనిన్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి. ఈ బియ్యం శరీరంలో ఉన్న అనవసరపు కొవ్వును కరిగిస్తుంది. లివర్ డీటాక్సిఫికేషన్ లో ఈ బియ్యం తోడ్పడుతుంది. ఈ రైస్ తినడం వలన అధిక రక్తపోటు (BP) సమస్య నుంచి బయటపడవచ్చు.
బ్లాక్ రైస్  లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటలో ఫైబర్‌, ఐరన్ కూడా ఉంటాయి. అదే సమయంలో రుచి పరంగా.. ఇది ఇతర రకాల బియ్యం కంటే తక్కువ కాదు.

Also Read:  Uric Acid: ఈ పండ్లు తింటే శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ లెవెల్ ఎక్కువవుతుంది

Exit mobile version