Vitamin D: ఎక్కువగా ఎండ తగిలినా, విటమిన్ డి ఉన్న ఆహారం తిన్నా, సప్లిమెంట్లు తీసుకున్నా కూడా శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే దానికి మీ చెడు ఆహారపు అలవాట్లే కారణం కావచ్చు. విటమిన్ డి (Vitamin D)ని అడ్డుకునే అంటే శరీరం విటమిన్ డిని గ్రహించకుండా ఆపే ఆహారాలు చాలా ఉన్నాయి. ఉదయం తాగే కాఫీ నుంచి మీరు ఆరోగ్యకరమైనవిగా భావించే స్నాక్స్ వరకు శరీరంలో విటమిన్ డి లోపానికి (Vitamin D Deficiency Causes) కారణం కావచ్చు. కాబట్టి విటమిన్ డిని గ్రహించకుండా ఆపే ఆ ఆహార పదార్థాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
విటమిన్ డి గ్రహించడాన్ని అడ్డుకునే ఆహారాలు ఇవే
ప్రాసెస్డ్ ఫుడ్స్ (Processed Foods)
ప్యాకెట్లలో లభించే ప్రాసెస్డ్ ఫుడ్స్ విటమిన్ డి లోపానికి కారణమవుతాయి. ఈ ఆహారాలలో ఫాస్ఫేట్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాల్షియం సమతుల్యతను దెబ్బతీస్తాయి. కాల్షియం లోపం వల్ల విటమిన్ డి లోపం మొదలవుతుంది. శరీరం విటమిన్ డిని మెరుగ్గా గ్రహించాలంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించడానికి ప్రయత్నించండి.
కెఫీన్
కాఫీ లేదా టీని అవసరానికి మించి ఎక్కువగా తీసుకుంటే శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడవచ్చు. కెఫీన్ కాల్షియం శోషణను అడ్డుకుంటుంది. దీని కారణంగా విటమిన్ డి శోషణపై ప్రభావం పడుతుంది. అందుకే కెఫీన్ ఉన్న పానీయాలను తక్కువగా తీసుకోవాలి.
Also Read: HUL Q2 Results : హెచ్‌యూఎల్‌కు రూ.2700 కోట్ల లాభం.. ఒక్కో షేరుకు రూ.19 డివిడెండ్
ఆల్కహాల్
ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటే కాలేయం (Liver) విటమిన్ డిని క్రియాశీలకం (Activate) చేయలేదు. దీనివల్ల పేగులలో మంట (Gut Inflammation) పెరుగుతుంది. పోషకాలను (Nutrients) గ్రహించడం తగ్గుతుంది. మీరు క్రమం తప్పకుండా మద్యం సేవించి, శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే దానికి ఆల్కహాల్ కారణం కావచ్చు.
అధిక ఆక్సలేట్ ఫుడ్స్
పాలకూర వంటి ఆకుకూరలలో ఆక్సలేట్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడవచ్చు. కాల్షియం, విటమిన్ డి కలిసి పనిచేస్తాయి. అందుకే విటమిన్ డి లోపాన్ని కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఫ్యాట్ ఫ్రీ- లో ఫ్యాట్ ఫుడ్స్
విటమిన్ డి అనేది కొవ్వులో కరిగే విటమిన్, అంటే విటమిన్ డి శరీరంలో గ్రహించబడటానికి కొవ్వు అవసరం. అటువంటి పరిస్థితిలో మీరు ఎప్పుడూ ఫ్యాట్ ఫ్రీ లేదా తక్కువ కొవ్వు ఉన్న వస్తువులనే తింటే శరీరం విటమిన్ డిని సరిగ్గా గ్రహించలేదు. అందుకే ఆహారంలో అవకాడో, డ్రై ఫ్రూట్స్, ఆలివ్ ఆయిల్, ఫుల్ ఫ్యాట్ యోగర్ట్‌లను చేర్చుకోవాలి.
విటమిన్ డి లోపాన్ని ఎలా గుర్తించాలి?
- ఎప్పుడూ అలసటగా అనిపిస్తుంది.
- శరీరంలో శక్తి లేమి ఉంటుంది.
- ఎముకలలో నొప్పి మొదలవుతుంది.
- కండరాలలో నొప్పి వచ్చి, బలహీనత అనిపిస్తుంది.
- మూడ్ మారుతూ ఉంటుంది. డిప్రెషన్‌గా (నిరాశగా) అనిపిస్తుంది.
- చేతులు, కాళ్ళలో తిమ్మిరి లేదా జలదరింపు ఉండవచ్చు.
- చర్మంపై పసుపు రంగు కనిపిస్తుంది.
- నోటిలో పుండ్లు రావడం మొదలవుతుంది.
- జుట్టు రాలడం ప్రారంభం కావచ్చు.
- జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది. వ్యక్తులు విషయాలు మర్చిపోవడం మొదలుపెడతారు.