రక్తంలో పరిమితికి మించి ఉన్న అధిక కొవ్వు అణువుల వల్ల అధిక కొలెస్ట్రాల్ (Cholesterol) సమస్య తలెత్తుతుంది. ఈ కొవ్వు అణువులు మీ ధమనుల గోడలపై పేరుకుపోయి.. వాటి నిడివిని తగ్గించేస్తాయి. ఫలితంగా గుండెకు రక్త సరఫరాలో ఆటంకం కలిగే ముప్పు పెరుగుతుంది.
అధిక కొలెస్ట్రాల్ వల్ల ధమనులు సంకుచితం అయితే.. మీ ప్రేగులు, ప్లీహము , కాలేయానికి జరిగే రక్త సరఫరా సైతం ప్రభావితం అవుతుంది. ప్రధానంగా కడుపులోని పేగులకు రక్త సరఫరాలో ఆటంకం కలుగుతుంది.
ఇది పేగు పరిధీయ ధమని వ్యాధి (PAD) కి దారి తీస్తుంది. ఒకవేళ దీనికి తగిన చికిత్స చేసి, రక్త ప్రసరణను పునరుద్ధరణ చేయకుంటే.. పేగులలోని సున్నితమైన కణజాలాలు దెబ్బతింటాయి. మీ కడుపులోని పేగుల్లో బాగా గడబిడగా ఉంటే.. వాటిలో ఏదైనా జరిగినట్టు మీరు ఫీలైతే డాక్టర్ల సలహాతో అలర్ట్ కండి. ఎందుకంటే.. బహుశా హై కొలెస్ట్రాల్ (Cholesterol) వల్ల ధమనులు కొవ్వుతో కూరుకుపోయి.. పేగులకు రక్త సరఫరా జరగకపోవడం వల్లే అలా జరిగిందేమో అనే కోణంలోనూ ఆలోచించండి. చాలామంది ఈవిధమైన లక్షణాలు ఎదుర్కొనే వారికి.. పేగుల్లో గడబిడ జరిగిన వెంటనే మల విసర్జన కూడా కలుగుతుంటుంది. తరుచుగా వాంతులు కావడం, లో బీపీ రావడం, తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగిపోవడం, రక్తంలో హైడ్రోజన్ మోతాదు పెరిగి అసిడోసిస్ సమస్య తలెత్తడం వంటివి అధిక కొలెస్ట్రాల్ ముప్పును సూచించే ఇతర లక్షణాలు.
వీపు దిగువ భాగంలో తొలి సంకేతం:
హై కొలెస్ట్రాల్ సమస్య మనల్ని చుట్టుముట్ట బోతోంది అనే దానికి సంబంధించిన తొలి సంకేతాలను మన వీపులోని దిగువ భాగం అందిస్తుంది. ఎందుకంటే.. మన శరీరంలోని గుండె నుంచి వీపు దిగువ భాగానికి రక్తాన్ని సరఫరా చేసే ధమనులు ఉంటాయి. ఇవి తమతో పాటు ఒకవేళ హై కొలెస్ట్రాల్ ను ఆ భాగానికి తీసుకొని వెళ్లి ఉంటే.. అక్కడ ప్రతిస్పందన మొట్టమొదట ప్రారంభం అవుతుంది. ఏదైనా ప్రతికూలంగా, అసౌకర్యంగా అనిపిస్తే సందేహించి వైద్యుణ్ణి సంప్రదించాలి. తద్వారా ముందస్తుగా హై కొలెస్ట్రాల్ గండాన్ని గట్టెక్కవచ్చు.
అధిక కొలెస్ట్రాల్‌ను ఎలా నివారించాలి ?
అధిక కొలెస్ట్రాల్ సమస్య పరిష్కారానికి మీకు నిబద్ధత అవసరం. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే అది సాధ్యమవుతుంది. సరైన ఆహారాన్ని తీసుకోవడం, తగిన మోతాదులో తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీరు మంచి లైఫ్ స్టైల్ ను పొందొచ్చు. ఒకవేళ ధూమపానం అలవాటు ఉంటే మానేయాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ మాంసాలు, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులను తినడంపై దృష్టి పెట్టండి.
Also Read: Vegetables Expiry Time : ఎన్ని రోజులు కూరగాయలు నిల్వ ఉంటాయి?