మన పిల్లలు(Kids) ఎప్పటికప్పుడు బరువు పెరుగుతున్నారా లేదా అనేది మనం తెలుసుకుంటూ ఉంటాము. కానీ శారీరకంగా బరువు పెరగడమే కాకుండా మెదడు(Brain) ఎదుగుదల బాగుందా లేదా అనేది తెలుసుకోవాలి. మెదడు ఎదుగుదలకు పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలుసుకోవాలి. ఎందుకంటే మెదడు ఎదుగుదల మనం మన పిల్లలకు ఇచ్చే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది.
మన పిల్లలలో మెదడు ఎదుగుదలకు విటమిన్ బి 1, విటమిన్ బి 2 , విటమిన్ బి 3 , విటమిన్ బి 5 , విటమిన్ బి 6 ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
విటమిన్ బి 1 అనేది పిస్తా పప్పులు, జీడిపప్పులు, బఠాణీలు, గుమ్మడికాయలు, బీన్స్, సన్ ఫ్లవర్ విత్తనాలు, చియా విత్తనాలు, గుమ్మడి గింజలు, బ్రెడ్, ఆకుకూరలలో ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వలన మెదడులోని కణజాలాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది మన శరీరంలో కార్బోహైడ్రాట్స్ ను శక్తిగా మారుస్తుంది.
విటమిన్ బి 2 మెదడులోని ఎంజైము ప్రతిచర్యలు సులువుగా అయ్యేలా చేస్తుంది. విటమిన్ బి 2 ఎక్కువగా పాలు, పెరుగు, జున్ను ఇంకా పాల సంబంధిత పదార్థాలలో లభిస్తుంది.
విటమిన్ బి 3 మన మెదడులో ఉండే కొవ్వును శక్తిగా మార్చే ఎంజైములను విడుదల చేయడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ బి 3 ఎక్కువగా సాల్మన్ చేపలు, బీన్స్, మజ్జిగ, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుడ్డు, ఆకుకూరలు వంటి పదార్థాలలో లభిస్తుంది.
విటమిన్ బి 5 కూడా మన మెదడులోని కొవ్వును శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది. విటమిన్ బి 5 ఎక్కువగా తాజా కూరగాయలు, పండ్లు, గుడ్డు, చికెన్, తేనె, పుట్టగొడుగులు వంటి వాటిలో ఉంటాయి.
విటమిన్ బి 6 అనేది మన మెదడు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. విటమిన్ బి 6 ఎక్కువగా కూరగాయలు, అరటిపండ్లు, బ్రౌన్ రైస్, బంగాళాదుంపలు, ఓట్స్, గుడ్డు వంటి వాటిలో లభిస్తుంది. కాబట్టి మెదడు చురుకుగా పని చేయడానికి కావలసిన ఆహారాన్ని మన పిల్లలకి అందించాలి.
Also Read : vitamin C: బాబోయ్! విటమిన్ సి తో శరీరానికి అన్ని రకాల ప్రయోజనాలా?