Site icon HashtagU Telugu

Karamcha: కొలెస్ట్రాల్ ని ఐస్ లా కరిగించే పండు.. అదేంటంటే?

Karamcha

Karamcha

మామూలుగా మనకు మార్కెట్లో ఎన్నో రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. అయితే అందులో మనం కేవలం కొన్ని రకాల పండ్లు మాత్రమే తిని ఉంటాము. మనకు తెలియని ఇంకా కొత్త రకమైన ఎన్నో రకాల పండ్లు కూడా మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే పండు కూడా మనకు మార్కెట్లో లభించవు. కేవలం ఆన్లైన్ లో మాత్రమే లభిస్తాయి. అలాగే ఈ పండు కాస్త రేటు ఎక్కువయినప్పటికీ ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ పండు పేరు కరంచా పండు. దీన్ని కొరొంచా, కరొండా, కరొంచా, కరిస్సా వంటి రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆన్‌లైన్ ఈ కామర్స్ సైట్లలో ఈ పండును అమ్ముతున్నారు.

We’re now on WhatsApp. Click to Join
డ్రై ఫ్రూట్స్‌ లాగా కూడా లభిస్తోంది. నిజానికి ఇది బెంగాల్లో కనిపించే పండు. అక్కడి మార్కెట్లు, గ్రామాల్లో దీన్ని చూడగలం. ఇది చిన్నగా, పుల్లగా ఉండే పండు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండు వేసవి, వర్షాకాలంలో పుష్కలంగా లభిస్తుంది. ఈ పండు రంగు లేత ఎరుపు, గులాబీ, తెలుపు ఉంటుంది. కరంచా పండు మన ఆరోగ్యాన్ని బాగా కాపాడుతుంది. రకరకాల వ్యాధుల్ని నయం చేస్తుంది. కరంచా తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ధమనులలో రక్త ప్రసరణ సాధారణంగా ఉంటుంది. తద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే అధిక బరువు ఉండేవారు ఈ పండును తినడం వల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది.

Also Read: Vastu Tips: టెర్రస్ పై అరటి చెట్టు పెంచుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

ఈ పండు శరీరంలో కొవ్వును ఐస్‌క్రీమ్‌లా కరిగించేస్తుంది. అలాగే ఇది పొట్ట సంబంధ వ్యాధుల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. పచ్చి కరంచా తినడం వల్ల దంతాలు, చిగుళ్లు బలపడతాయి. కరంచాలో విటమిన్ బి, సి తో పాటు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, టానిన్లు, క్యారిసోన్స్, ట్రైటెర్పెనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ పండుకి డిమాండ్ ఎక్కువ. ధర కూడా ఎక్కువే. 100 గ్రాముల ప్యాకెట్ రూ.70 రూపాయలకు పైనే ఉంటుంది. ఈ పండు పుల్లని రుచిని కలిగి ఉంటుంది. అయితే కాలేయం, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా కరంచాను తీసుకోవాలి. తద్వారా అనారోగ్యాలు నయమవుతాయి.

Also Read: Water Melon: పుచ్చకాయతో వీటిని కలిపి తింటున్నారా.. అయితే జాగ్రత్త?