Zakir Hussain Disease : ప్రముఖ తబలా వాయిద్య కళాకారుడు జాకిర్ హుస్సేన్ ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (ఐపీఎఫ్) వ్యాధితో బాధపడుతూ ఇటీవలే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో చనిపోయారు. ఇంతకీ ఈ వ్యాధి ఏమిటి ? ఎలా వస్తుంది ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Cyclone Chido : చిడో తుఫాను బీభత్సం.. ఫ్రాన్స్‌లో వేలాది మంది మృతి
ఏమిటీ వ్యాధి ?
ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (ఐపీఎఫ్) వ్యాధి వివరాల్లోకి వెళ్తే.. మన ఊపిరితిత్తులలో చిన్న, సున్నితమైన గాలి సంచులు (అల్వియోలీ) ఉంటాయి. మనం గాలి పీల్చినప్పుడు రక్తప్రవాహంలోకి ఆక్సిజన్ చేరడానికి ఈ గాలి సంచులు సహాయ పడతాయి. ఈ గాలి సంచుల చుట్టూ ఉన్న కణజాలాలను ప్రతికూలంగా ప్రభావితం చేసి, మందంగా మార్చేసే వ్యాధే ‘ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్’. గాలి సంచుల(Zakir Hussain Disease) చుట్టూ ఉన్న కణజాలాలు మందంగా మారడం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టతరంగా మారుతుంది. గాలి సంచులపై మచ్చలు కూడా ఏర్పడుతాయి. ఐపీఎఫ్ వ్యాధి వచ్చిన తర్వాత మనం గాలి పీల్చినా.. రక్తప్రవాహంలోకి ఆక్సిజన్ చేరడం కష్టతరంగా మారిపోతుంది. ఈ దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధిని సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోవాలి. లేదంటే ప్రాణానికి ప్రమాదం.
Also Read :Assad 2100 Crores : వామ్మో.. సిరియా నుంచి అసద్ అంత డబ్బు తీసుకెళ్లాడా ?
ఈ వ్యాధి ముప్పు వీరికే ఎక్కువ..
బాగా స్మోకింగ్ చేసే వారికి ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (ఐపీఎఫ్) వ్యాధి ముప్పు ఎక్కువగా ఉంటుంది. గతంలో ఫ్యామిలీలో ఎవరికైనా ఈ వ్యాధి వచ్చి ఉంటే..ఆ కుటుంబంలోని వారికి కూడా ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. 60 నుంచి 70 ఏళ్లు దాటిన వారికి ఐపీఎఫ్ వ్యాధి ముప్పు ఉంటుంది. స్త్రీల కంటే పురుషులకే ఈ వ్యాధి రిస్క్ ఎక్కువ. రసాయనాలు, ప్రమాదకర పదార్థాలను పీల్చడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని ఐపీఎఫ్ వ్యాధి వస్తుంటుంది. ఈ వ్యాధి వస్తే.. ఊపిరి ఆడకపోవడం, విపరీతమైన పొడిదగ్గు, కీళ్ళు ,కండరాలలో నొప్పి, అలసట, చేతివేళ్లు లేదా కాలి వేలి గోర్లు ఉబ్బడం, రక్తంలో ఆక్సిజన్ తగ్గడం, కళ్ల చుట్టూ బూడిద రంగు వంటి లక్షణాలు బయటపడతాయి.