Health Tips: ఇంట్లోని అనేక సమస్యలను పరిష్కరించుకోవడానికి మన వంటగదిలోని వస్తువులే అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే మన వంటగదిని ‘ఔషధాల గని’ అని పిలుస్తారు. వంటగదిలోని మసాలా దినుసుల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కేవలం మిరియాలు లేదా పసుపు మాత్రమే కాదు మనం వాడే ఉప్పు కూడా చాలా మేలు చేస్తుందని మీకు తెలుసా? కేవలం చిటికెడు ఉప్పును కొద్ది సెకన్ల పాటు నాలుక కింద ఉంచుకుంటే ఒక పెద్ద సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నాలుక కింద ఉప్పు ఉంచితే ఏమవుతుంది?
మీకు తీవ్రమైన తలనొప్పిగా ఉన్నప్పుడు చిటికెడు ఉప్పును నాలుక కింద ఉంచుకుని, కొన్ని సెకన్ల తర్వాత ఒక గ్లాసు నీళ్లు తాగితే.. కేవలం 5 నిమిషాల్లో తలనొప్పి మాయమవుతుంది. ఉప్పులోని సోడియం రక్తంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది. మెదడులోని రక్తనాళాల వాపును తగ్గిస్తుంది. దీనివల్ల నొప్పి తగ్గుతున్నట్లు మెదడుకు సంకేతాలు అందుతాయి. తలనొప్పి కోసం మాటిమాటికీ మందులు వాడాల్సిన అవసరం ఉండదు.
Also Read: చెక్ బౌన్స్ అయితే ఎంత నష్టమో తెలుసా?!
తలనొప్పి తగ్గడానికి ఇతర చిట్కాలు
నీళ్లు తాగడం: శరీరంలో డీహైడ్రేషన్ (నీటి శాతం తగ్గడం) వల్ల కూడా తలనొప్పి వస్తుంది. తరచుగా నీళ్లు తాగడం వల్ల తలనొప్పి తీవ్రత తగ్గుతుంది.
వెల్లుల్లి: వెల్లుల్లిలో ‘అల్లిసిన్’ అనే పదార్థం ఉంటుంది. వెల్లుల్లిని నీటిలో మరిగించి ఆ నీటిని తాగడం వల్ల వాపు తగ్గి తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
అల్లం: అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తలనొప్పిని తగ్గిస్తాయి. అల్లాన్ని చిన్న ముక్కలుగా కోసి నీటిలో మరిగించి, ఆ నీటిని టీ లాగా తాగితే మంచి ఫలితం ఉంటుంది.
తలకు ఈ లేపనం పూయండి
తలనొప్పిని వదిలించడంలో లవంగాలు కూడా బాగా పనిచేస్తాయి.
చిట్కా: ఒక స్పూన్ కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల లవంగం నూనె వేసి అందులో ఒక స్పూన్ ఉప్పు కలిపి మిశ్రమంలా చేయండి. ఈ పేస్ట్‌ను నుదుటిపై రాసుకుని ఒక శుభ్రమైన రుమాలును తలపై ఉంచుకోండి. దీనివల్ల తలనొప్పి త్వరగా తగ్గుతుంది.
