Site icon HashtagU Telugu

Green Tea: రాత్రి పడుకునే ముందు ఒక కప్పు గ్రీన్ టీ తాగితే చాలు.. కలిగి లాభాలు అస్సలు నమ్మలేరు!

Green Tea

Green Tea

గ్రీన్ టీ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. ఈ మధ్య కాలంలో గ్రీన్ టీ తాగే వారి సంఖ్య పెరిగింది. కాఫీ, టీ లకు బదులుగా గ్రీన్ టీ ఎక్కువగా తాగుతున్నారు. కొందరు ఉదయాన్నే తాగితే మరికొందరు సాయంత్రం తాగుతూ ఉంటారు. ఇకపోతే ఎప్పుడు అయినా రాత్రి పూట పడుకునే ముందు గ్రీన్ టీ తాగారా, అలా తాగితే ఏం జరుగుతుందో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గ్రీన్ టీలో అమైనో ఆమ్లం ఎల్ థియనిన్ ఉంటుంది.

ఇది మీరు మంచి విశ్రాంతి తీసుకోవడానికి బాగా సహాయపడుతుందట. దీనిలో యాంటీ యాంగ్జైటీ లక్షణాలు కూడా ఉంటాయి. దీన్ని రాత్రి పడుకునే ముందు తాగితే మీరు కంటినిండా నిద్రపోవచ్చని చెబుతున్నారు. ఇది సహజంగా మీ ఒత్తిడిని తగ్గిస్తుందట. అలాగే గ్రీన్ టీ ని తాగితే మన శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కూడా తగ్గుతుందట. అలాగే గ్రీన్ టీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుందని, ఇది ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుందని చెబుతున్నారు. అలాగే గ్రీన్ టీ మిశ్రమంలో ఉండే కెఫిన్ మీ మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుందట. ఇది మీకు మంచి విశ్రాంతి భావనను కూడా ఇస్తుందని, గ్రీన్ టీలో ఉండే ఎల్ థియనిన్ డిప్రెషన్ లక్షణాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు.

బరువు తగ్గాలనుకునే వారికి కూడా గ్రీన్ టీ బాగా సహాయపడుతుందట. మీరు రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక కప్పు గ్రీన్ టీ తాగితే కేలరీలు కరిగిపోతాయట. ఫాస్ట్ గా బరువు తగ్గడానికి మీరు రాత్రిపూట గ్రీన్ టీ తాగవచ్చట. ఇది కొవ్వును ఫాస్ట్ గా కరిగిస్తుందని చెబుతున్నారు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఇవి మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడానికి బాగా సహాయపడతాయని, కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి కూడా గ్రీన్ టీ సహాయపడుతుందని చెబుతున్నారు. ఒకవేళ మీకు దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉన్నట్లయితే రాత్రి పడుకునే ముందు ఒక కప్పు గ్రీన్ టీ తాగాలట. ఇది మీ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుందట. అలాగే పడుకునే ముందు 1 కప్పు గ్రీన్ టీ తాగితే మెటబాలిజం పెరుగుతుందని,ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందని. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు.