Site icon HashtagU Telugu

Paper Cups: బయట పేపర్ కప్స్ లో టీ తాగుతున్నారా.. వెంటనే ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే?

Paper Cups

Paper Cups

రోడ్డు పక్కన టీ స్టాల్స్, కేఫ్ లలో పేపర్ కప్స్ లలో టీ ఎక్కువగా తాగుతూ ఉంటారు. కొన్ని ప్రదేశాలలో గాజు కప్పులలో టీ తాగుతూ ఉంటారు. నిజంగా పేపర్ కప్స్ లో టీ తాగడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదని ఇది చాలా డేంజర్ అని అంటున్నారు. మరి ఈ పేపర్ కప్స్ లో టీ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పేపర్ కప్స్ లో టీ తాగిన తర్వాత వాటిని మళ్లీ కడగాల్సిన పని ఉండదు. అందుకే బయట కేఫ్ అలాగే కాఫీ షాపులలో టీ షాప్ లలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

కొన్నిసార్లు పెళ్లిళ్లు ఏదైనా ఫంక్షన్ల సమయంలో ఇళ్లల్లో కూడా ఇలాంటి కప్పులను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పేపర్ కప్పులు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావట. కాగితపు కప్పుల్లో పెట్రోలియం ఆధారిత రసాయనం బిస్ఫెనాల్ ఉంటుందట. ఇది శరీరానికి చాలా హానికరం అని చెబుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి కప్పుల్లో టీ తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయట. వీటిలో ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే క్రిములు కూడా ఉంటాయని చెబుతున్నారు.

ఈ కప్పుల్లో ఉపయోగించే పూతలలో ఈ హానికరమైన బిస్ఫెనాల్స్, పెట్రోలియం ఆధారిత రసాయనాలు ఉంటాయట. కాబట్టి ఆ టీ తాగినప్పుడు అది నేరుగా కడుపులోకి వెళ్తుందని, అది నెమ్మదిగా ఎన్నో రకాల సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. ఇలా ప్రతిరోజూ ఒక పేపర్ కప్పులో టీ తాగడం వల్ల శరీరంలో బీపీఏ పెరుగుతుందట. ఇది శరీరానికి చాలా హానికరం అనే వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో బీపీఏ స్థాయి పెరిగితే క్యాన్సర్ ముప్పు పెరుగుతుందట. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందట. కాబట్టి ఇకమీదట అయినా బయట టీ షాప్ లో టీ తాగేటప్పుడు గాజు గ్లాస్ లేదంటే గాజు కప్పులలో టీ తాగడం మంచిది. ఒక్కసారి కదా పేపర్ కప్స్ లో తాగితే ఏమవుతుంది అనుకుని తాగితే మాత్రం అది నెమ్మదిగా దాని ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు.