Site icon HashtagU Telugu

Prostate Cancer: పదేపదే మూత్రవిసర్జన చేస్తున్నారా? అయితే మీకు ఈ క్యాన్స‌ర్ ఉన్న‌ట్లే!

Prostate Cancer

Prostate Cancer

Prostate Cancer: మీరు పదేపదే మూత్రవిసర్జన కోసం బాత్రూమ్‌కి వెళ్ళాల్సి వస్తోందా? మూత్ర ప్రవాహం బలహీనంగా ఉందా? లేదా మధ్యమధ్యలో ఆగి ఆగి వస్తుందా? అయితే ఈ లక్షణాలను తేలికగా తీసుకోవడం ప్రమాదకరం. ముఖ్యంగా పురుషులకు ఈ సంకేతాలు అస్సలు మంచివి కావు. ఇది ప్రొస్టేట్ క్యాన్సర్‌ (Prostate Cancer)కు సంబంధించిన లక్షణాలు కావచ్చునని, 50 ఏళ్లు పైబడిన పురుషులలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్ గురించి, మూత్రవిసర్జనలో కనిపించే లక్షణాల గురించి తెలుసుకుందాం.

ప్రొస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి?

క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఒక వ్యాధి. ఇది శరీరంలోని అనేక అవయవాలలో రావచ్చు. కొంతకాలంగా పురుషులలో ప్రొస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇది పురుషులలోని ప్రొస్టేట్ గ్రంధి నుండి మొదలవుతుంది. ఈ క్యాన్సర్ మూత్రాశయం దగ్గర వస్తుంది. ప్రొస్టేట్ అనేది పురుషులలో స్పెర్మ్ తయారు చేసే ఒక గ్రంధి. దీనిని ప్రొస్టేట్ నోడ్యూల్ అని కూడా అంటారు.

Also Read: T-SAT: బ్యాంక్ ఉద్యోగాలకు టీ-సాట్ నుండి ప్రత్యేక ఆన్‌లైన్ కోచింగ్!

మూత్రవిసర్జనలో కనిపించే సంకేతాలతో క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవచ్చు

మూత్రవిసర్జన చేసేటప్పుడు వచ్చే ఇబ్బందులను నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. ఇది క్యాన్సర్ కూడా కావచ్చు. ఈ 5 సంకేతాలను గమనించండి.

క్యాన్సర్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?

ఎగువన తెలిపిన లక్షణాలలో ఏ ఒక్క లక్షణం మీకు కనిపించినా మీరు వెంటనే కొన్ని పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరీక్షలలో బ్లడ్ టెస్ట్, పీఎస్ఏ టెస్ట్, MRI చేయించుకోవాలి. అయితే దీనికి ముందు మీరు ఒక వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవాలి. పీఎస్ఏ టెస్ట్, MRI ఫలితాలు పాజిటివ్ వస్తే ఆ తర్వాత బయాప్సీ, అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. దీని ద్వారా క్యాన్సర్‌ను నిర్ధారించుకోవచ్చు.

ప్రొస్టేట్ క్యాన్సర్ ఇతర సంకేతాలు

వ్యాధి నుండి రక్షణకు కొన్ని ఉపాయాలు

క్యాన్సర్ చివరి దశలో పూర్తిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అయితే తక్కువ స్థాయి క్యాన్సర్ ఉంటే ఎక్కువగా యాక్టివ్ సర్విలెన్స్ సహాయంతో ఫాలోఅప్ ట్రీట్‌మెంట్ చేస్తారు. ఇందులో శస్త్రచికిత్స, రేడియోథెరపీ ఉంటాయి. ఈ క్యాన్సర్‌ను పూర్తిగా నిరోధించడానికి కచ్చితమైన మార్గం లేదు. కానీ ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యం సేవించడం మానేయడం చాలా అవసరం.