Site icon HashtagU Telugu

Reverse Walking : వామ్మో.. రివర్స్ వాకింగ్ వల్ల ఏకంగా అన్ని ప్రయోజనాలా?

Dinner Walking

Dinner Walking

Reverse Walking : ప్రతిరోజు కొద్దిసేపు నడవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. నడక అనేది ఆరోగ్యానికి ఒక ఉత్తమమైన వ్యాయామం. ప్రతిరోజు కొద్దిసేపు నడవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరతాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో భోజనం చేసిన తరువాత కొద్దిసేపు వాకింగ్ చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. అలాగే ఎన్నో వ్యాయామలు చేస్తూ ఉండవచ్చు. కానీ మీరు రివర్స్ వాకింగ్ (Reverse Walking) ఎప్పుడైనా ట్రై చేశారా, రివర్స్ వాకింగ్ లో అడుగులు వెనకకి వేయడం ఉంటుంది..

We’re Now on WhatsApp. Click to Join.

చిన్నతనంలో మీరు సరదాగా ఆటల్లో భాగంగా ఇలా సరదాగా రివర్స్ వాకింగ్ (Reverse Walking) చేసి ఉంటారు. కానీ ఈ వ్యాయామం శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రివర్స్ వాకింగ్ వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో? ఎలాంటి లాభాలు చేయకూరతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రివర్స్ వాకింగ్ (Reverse Walking) చేయడం వల్ల మోకాలి పై ఒత్తిడి కలగదు. కాబట్టి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు కొద్దిసేపు రివర్స్ వాకింగ్ చేయడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే రివర్స్లో నడవడం వల్ల మోకాళ్ళపై ఒత్తిడి ఉండదు. అలాగే రివర్స్ వాకింగ్ రెండు కాళ్లల్లోని కండరాలను బలపరుస్తుంది. వెనక్కి నడవడం వలన కండరాలు అధికంగా సాగుతాయి.

అలాగే ఈ వ్యాయామం చేసేటప్పుడు కాళ్ల నొప్పులు కూడా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందీవాలి, రివర్స్ వాకింగ్ మానసిక ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. వెనకకు నడిచేటప్పుడు ఏకాగ్రత చాలా ముఖ్యం. మెదడు దృష్టి కేంద్రీకరించడానికి ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలోని ఇతర అవయవాలు, మెదడు సమన్యయముయంతో పనిచేస్తాయి. రివర్స్ వాకింగ్ చేయడం వల్ల వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. రివర్స్ వాకింగ్ కింది వీపుపై ఒత్తిడి తెస్తుంది. దీని వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. వైద్యుని సలహా తీసుకున్న తర్వాత ఈ వ్యాయామం చేయవచ్చు.

Also Read:  Drinking Water: నీటిని ఎక్కువగా తాగుతున్నారా.. అయితే జాగ్రత్త.. ప్రమాదంలో పడ్డట్టే?