వెనిగర్ (Vinegar ) అనేది వంటలలో మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా అనేక ప్రయోజనాలను అందించే ఒక ముఖ్యమైన ద్రావణం. ఇది ప్రధానంగా ఎసిటిక్ యాసిడ్‌ను కలిగి ఉంటుంది. ఇది శరీరానికి పలు విధాలుగా ఉపయోగపడుతుంది. వెనిగర్‌లోని ఔషధ గుణాలు రక్తపోటును నియంత్రించడంతో పాటు గుండె సంబంధిత సమస్యల నుండి రక్షణ కల్పిస్తాయి. విదేశాలలో ఊరగాయలు తయారీలో వెనిగర్‌ను విస్తృతంగా ఉపయోగిస్తారు. తక్కువ క్యాలరీలతో ఉండే వెనిగర్, కొవ్వు తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది.
వెనిగర్(Vinegar )తో బరువు తగ్గుదల & ఆరోగ్య ప్రయోజనాలు
వెనిగర్‌ను ఆహారంలో తీసుకోవడం వలన ఆకలి నియంత్రణ జరుగుతుంది. తద్వారా అధికంగా తినకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇది కొవ్వును కరిగించే గుణాన్ని కలిగి ఉండటంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా వెనిగర్‌లో ఉండే యాసిడ్లు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. డయాబెటిస్ రోగులలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేలా చేస్తాయి. చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లకు వెనిగర్ మంచి నివారణగా పనిచేస్తుంది. గాయాలు త్వరగా మానేందుకు, మంట తగ్గించేందుకు వెనిగర్‌ను ఉపయోగించవచ్చు.
JACK Trailer :‘జాక్’ ట్రైలర్ టాక్ – యూత్‌కు స్పెషల్ ట్రీట్
వెనిగర్ వినియోగంలో జాగ్రత్తలు
వెనిగర్ (Vinegar ) అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించినప్పటికీ, దీన్ని అధిక మోతాదులో తీసుకోవడం మంచిది కాదు. అసిడిటీ, అల్సర్ వంటి సమస్యలు ఉన్నవారు వెనిగర్‌ను తీసుకునే ముందు వైద్యుల సూచనలు తీసుకోవడం ఉత్తమం. వెనిగర్‌కు బదులుగా నిమ్మరసం కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే దీంట్లోనూ ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఉంటాయి. మీరు తినే ఆహార పదార్థాల్లో కొద్దిగా వెనిగర్ కలిపి తీసుకుంటే, రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.