Vibrio Vulnificus : అమెరికా ప్రజలను వణికిస్తున్న విబ్రియో వల్నిఫికస్ బ్యాక్టీరియా

అగ్రరాజ్యం లో ‘విబ్రియో వల్నిఫికస్’ (Vibrio vulnificus) అనే బ్యాక్టీరియా అక్కడి ప్రజలను నిద్ర లేకుండా చేస్తుంది

Published By: HashtagU Telugu Desk
Vibrio Vulnificus

Vibrio Vulnificus

విబ్రియో వల్నిఫికస్ (Vibrio vulnificus)..ఈ పేరు చెపితే అమెరికా (United States) ప్రజలు వణికిపోతున్నారు. రెండేళ్ల పాటు కరోనా (Corona) మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని ఎలా గడగడలాడించిందో తెలియంది కాదు..చూస్తుండగానే మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సొంత కుటుంబ సభ్యులు చనిపోయిన చేసుకోలేని పరిస్థితి వచ్చింది. అలాంటి దారుణ పరిస్థితి నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ప్రజలకు..కొత్త కొత్త వేరియంట్ల రూపంలో ప్రాణాలను తీసుకుపోయే మహమ్మరిలు పుట్టుకొస్తుండడం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది.

తాజాగా అగ్రరాజ్యం లో ‘విబ్రియో వల్నిఫికస్’ (Vibrio vulnificus) అనే బ్యాక్టీరియా అక్కడి ప్రజలను నిద్ర లేకుండా చేస్తుంది. రోజు రోజుకు ‘విబ్రియో వల్నిఫికస్’ ఇన్‌ఫెక్షన్‌ కేసులు (Vibrio vulnificus Cases) ఎక్కువైపోతున్నాయి. విబ్రియో వల్నిఫికస్‌ అనే బ్యాక్టీరియా గాయాల ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించి.. క్రమంగా చర్మం, కండరాలు, రక్తనాళాలు తదితర భాగాలను తినేస్తుంది. అమెరికాలో ఏటా డజన్ల కొద్దీ దీని వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. పచ్చివి లేదా ఉడికించని నత్తగుల్లలు, షెల్‌ఫిష్‌లు తినడం ద్వారా ఈ బ్యాక్టీరియా బారినపడతారని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

ఈ ఏడాది ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారని సీడీసీ (Centers for Disease Control and Prevention) నిపుణులు పేర్కొన్నారు. ప్రతి ఏటా సుమారు 200 మంది అమెరికన్లు విబ్రియో వల్నిఫికస్ బారిన పడుతుండగా.. కనీసం ఐదుగురు మరణిస్తున్నారు. ఈ ఇన్‌ఫెక్షన్‌ను అరికట్టేందుకు చొరవ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. విబ్రియో వల్నిఫికస్ బాక్టీరియా మనుషుల్లో ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. పచ్చి మాంసం.. ఉడకని మాంసాన్ని తినడంతో చర్మ గాయాలకు కారణమవుతుంది.

వల్నిఫికస్ బ్యాక్టీరియా (Vibrio Vulnificus) వ్యాధి ఎవరికీ ఎక్కువగా సోకుతుందంటే..

ఇతర దీర్ఘకాలిక వ్యాధులు మధుమేహం, సిరోసిస్, కిడ్నీ వ్యాధులు, లివర్ సమస్యలుండేవారికి త్వరగా విబ్రియో వల్నిఫికస్ బ్యాక్టీరియా వ్యాధి సోకుతోంది. మగవారిలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని సీడీసీ వెల్లడించింది. ఈ బ్యాక్టీరియా శరీరంలో మాంసాన్ని తినేస్తుంది. ఎక్కువగా ఉప్పునీటిలో లేదా ఉప్పునీరు, మంచి నీరు కలిసే ప్రాంతాల్లో కన్పిస్తుంది.

Read Also : Telangana Politics : వామ్మో వీళ్లంతా కారు దిగి..కాంగ్రెస్ గూటికి చేరుతున్నారా..?

ఈ వ్యాధి (Vibrio Vulnificus) లక్షణాలు :

జ్వరం, లో బీపీ, చర్మంపై బొబ్బలు ఏర్పడుతాయి. ఇవి విబ్రియో వల్నిఫికస్ లక్షణాలని, ఎవరిలోనైనా ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు.

ఈ వ్యాధి (Vibrio Vulnificus) బారినపడకుండా ఉండాలంటే..

పచ్చి, సరిగా ఉడకని మాంసంతో పాటు ముఖ్యంగా సముద్రపు చేపలను తీసుకోవడాన్ని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో టాటూలు వేసుకోవడం, శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు సముద్రపు జలాలు, ఉప్పు నీటి జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నారు. సముద్రాలకు దగ్గరగా నివసించే వారికి ఇన్ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ ఉంటుందని, అలాంటి వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

ఈ వ్యాధి (Vibrio Vulnificus) వల్ల ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారంటే…

నేచర్‌ పోర్ట్‌ఫోలియో జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. 1988-2018 మధ్య మూడు దశాబ్దాల్లో ఈ ఇన్‌ఫెక్షన్ల రేటు ఎనిమిది రెట్లు పెరిగింది. గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో అత్యధిక కేసులు వెలుగు చూశాయని వాండర్‌ బిల్ట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ విలియమ్స్ స్కాఫ్నర్ తెలిపారు.

ఈ ఏడాది వేసవి కాలంలో అమెరికా తూర్పు తీరంలో కనీసం ఆరుగురు ఈ బ్యాక్టీరియా కారణంగా చనిపోయారు. జులైలో కనెక్టికట్‌లో ఇద్దరు, న్యూయార్క్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఆగస్టులో ఉత్తర కరోలినాలో ముగ్గురు చనిపోయారు.

Read Also : Telangana : జీతాలు అందడంలేదని ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న హోంగార్డు మృతి

  Last Updated: 08 Sep 2023, 10:36 AM IST