Site icon HashtagU Telugu

Vamu : తొందరగా బరువు తగ్గాలని అనుకుంటున్నారా.. అయితే వాముతో చేయాల్సిందే?

Vamu Want To Lose Weight Fast.. But Do You Have To Do It With Vamu..

Vamu Want To Lose Weight Fast.. But Do You Have To Do It With Vamu..

Vamu : ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొందరు బక్క పల్చగా ఉన్నాను అని బాధపడుతుంటే ఇంకొందరు మాత్రం ఎక్కువగా లావు అవుతున్నాము బరువు తగ్గాలి అని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కలిగించుకోవాలని చాలామంది అనేక రకాల ఎక్సర్సైజులు చేయడంతో పాటు రకరకాల వంటింటి చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అయితే మీ నడుము పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోవాలంటే ఒక హోమ్ రెమెడీని పాటిస్తే చాలు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే నెల రోజుల్లోనే దాదాపుగా 20 కేజీల వరకు వెయిట్ లాస్ అవ్వవచ్చు. అందుకోసం వాము (Vamu) ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మన వంటింట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో వాము (Vamu) తప్పనిసరిగా ఉంటుంది. మరి వాముతో ఎలా బరువు తగ్గాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముందుగా వామును కొంచెం తీసుకొని ఒక గిన్నెలో వేసి బాగా వేడి చేయాలి. కాసేపు అయ్యాక వామును చల్లార్చి ఎండిపోయిన కరివేపాకు రెబ్బలను కూడా తీసుకొని వాటిని మిక్సీలో గ్రైండ్ చేసుకొని మెత్తగా పౌడర్ లా చేసుకోవాలి. ఆ పౌడర్ ను రోజూ ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగుతూ ఉండాలి.

ఇలా రోజూ ఒక గ్లాస్ వాము పౌడర్ నీటిని తాగడం వల్ల శరీరంలో ఊహించని పరిణామాలు జరుగుతాయి. శరీరంలో ఉండే అనవసర కొవ్వు కరిగిపోతుంది. రోజూ చేసే కసరత్తులతో పాటు ఈ వాము నీళ్లను కూడా తీసుకుంటే నెల రోజుల్లోనే 20 కిలోల వరకు తగ్గుతారు. వాము కేవలం బరువును తగ్గించడం మాత్రమే కాకుండా జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది జీవ క్రియ మెరుగుపడుతుంది. పేగులు శుభ్రం అవుతాయి. గ్యాస్ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే బరువు తగ్గడంతో పాటు జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

Also Read:  Health: కలబందతో అనేక రోగాలు మాయం.. ఆరోగ్య ప్రయోజనాలివే