శుద్ధి చేసిన నూనెలు (Cooking Oils), ముఖ్యంగా PUFAలు ఎక్కువగా ఉంటాయి, సులభంగా క్షీణిస్తాయి కాబట్టి, వేయించడానికి దూరంగా ఉండాలి. దీనికి విరుద్ధంగా, సంతృప్త కొవ్వులు (నెయ్యి/కొబ్బరి నూనె వంటివి) అధికంగా ఉండే నూనెలను భారతీయ వంటలకు ఉపయోగించవచ్చు, ఎందుకంటే అవి వేయించేటప్పుడు స్థిరంగా ఉంటాయి. మరిన్ని వంటలకు ఉపయోగించే నూనెలను (Cooking Oils) చూదాం..
నువ్వుల నూనె:
దీని స్మోకింగ్ పాయింట్ తక్కువ. అంటే సలసల కాగించడానికి అనుకూలం కాదు. ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు. ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనెలో 5 గ్రాముల మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్, 2 గ్రాముల శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటాయి.
పీనట్ ఆయిల్ (పల్లీ నూనె):
ఈ నూనెను ఎంత వేడిమీద అయినా కాచొచ్చు. కనుక గారెలు, వడలు, పూరీలు తదితర కాగే నూనెలో చేసే వంటలకు అనుకూలం. వేపుళ్లకు ఏ వంట నూనె కూడా అనుకూలం కాదు. కనుక వేపుళ్లను మానుకోవడం మంచిది.
ఆలివ్ ఆయిల్:
ఇందులోనూ హానికారక కొవ్వులు లేవు. ఆరోగ్యానికి మంచి చేసే వంట నూనెల్లో దీనికి వైద్యులు మొదటి స్థానాన్ని ఇస్తుంటారు. అభివృద్ధి చెందిన దేశాల్లో దీని వినియోగం ఎక్కువ. కొంచెం ఖరీదైనది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి. మనకు మంచి చేసే మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. దీని స్మోకింగ్ పాయింట్ తక్కువ. కనుక సన్నని మంటపై చేసే వంటకాలకు వాడుకోవచ్చు.
చియా సీడ్ ఆయిల్:
చియాసీడ్స్ నల్ల నువ్వుల మాదిరే ఉంటాయి. ఇందులో ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండెకు మంచి చేసే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పత్తికి సాయపడుతుంది. దీని స్మోకింగ్ పాయింట్ ఎక్కువ. కనుక కాచి చేసే వంటలకు వాడుకోవచ్చు.
అవకాడో ఆయిల్:
అవకాడో పండు నుంచే దీన్ని తయారు చేస్తారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ. ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించేందుకు, యాంటీ ఆక్సిడెంట్లుగా ఇది ఉపయోగపడుతుంది.
Also Read: Arthritis Problem : చలికాలంలో కీళ్ల నొప్పుల సమస్యకు ఇలా చెక్ పెట్టండి..