Smart Phones : స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా.. ఈ నొప్పులతో జాగ్రత్త..

స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా వాడడం వలన మనకు చాలా రకాల పెయిన్స్(Pains) వస్తాయి. ఇంకా కొత్త రకాల జబ్బులు కూడా వస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - May 31, 2023 / 10:30 PM IST

ఈ రోజుల్లో ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేవరకు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్(Smart Phones) ఉంటున్నాయి. కానీ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా వాడడం వలన మనకు చాలా రకాల పెయిన్స్(Pains) వస్తాయి. ఇంకా కొత్త రకాల జబ్బులు కూడా వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా వాడడం వలన అదే పనిగా చూస్తూ ఉండడం వలన మనకు మొదట మెడ నొప్పి, భుజాల నొప్పులు వస్తాయి. ఎక్కువసేపు ఫోన్ ని పట్టుకొని చూడడం వలన నడుం నొప్పి వస్తాయి.

ఇంకా ఫోన్ ని చేతితో పట్టుకొని ఎక్కువసేపు ఉండడం వలన చేతి మణికట్టు, రేడియల్ కణాలలో నొప్పి, మణికట్టు దగ్గర వాపు వంటివి కలుగుతాయి. కాబట్టి స్మార్ట్ ఫోన్స్ ను వాడేటప్పుడు చేతిని ఎక్కువగా ఉపయోగించకుండా ఏదయినా ఒక ప్లేస్ లో ఉంచి వాడితే మంచిది. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వృద్దులకు వచ్చే ఒక రకమైన వ్యాధి కానీ ఇది ఇప్పుడు ఎవరైతే స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా వారికి వస్తుంది వారు చిన్న పిల్లలైనా లేదా యువత అయినా వయసుతో సంభంధం లేకుండా వస్తుంది.

కార్పొమెటాకార్పోల్ జాయింట్ పెయిన్స్ అనేవి స్మార్ట్ ఫోన్స్ లో చాటింగ్ ఎక్కువగా చేయడం వలన యువతకు వస్తున్నాయి. కాబట్టి రోజులో రెండు నుండి మూడు గంటల వరకు స్మార్ట్ ఫోన్ ఉపయోగించవచ్చు అంతకంటే ఎక్కువ సమయం ఉపయోగించరాదు. స్మార్ట్ ఫోన్ ను వాడేటప్పుడు పడుకొని వాడకూడదు నిటారుగా కూర్చొని స్మార్ట్ ఫోన్ ఉపయోగించాలి. లేకపోతే మనకు వచ్చే పెయిన్స్ ఎక్కువగా వస్తాయి. స్మార్ట్ ఫోన్స్ ని ఏదయినా పని కోసం ఉపయోగించుకోవాలి ఖాళీగా ఉన్నామని ఉపయోగిస్తే మనకు ఇలా రకరకాల పెయిన్స్, జబ్బులు వస్తాయి. కాబట్టి చూసుకొని ఎంతవరకు మనకు స్మార్ట్ ఫోన్ ఉపయోగమో అంతవరకు మాత్రమే ఉపయోగించాలి.

 

Also Read : Krishna – Mahesh : కృష్ణ మహేశ్ బాబు కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?