Bioprinted Skin : బయో ప్రింటెడ్ చర్మం రెడీ.. స్పెషాలిటీ తెలుసా ?

Bioprinted Skin : తొలిసారిగా పూర్తిస్థాయిలో బయో ప్రింటెడ్ చర్మం రెడీ అయింది.

  • Written By:
  • Updated On - October 10, 2023 / 09:06 AM IST

Bioprinted Skin : తొలిసారిగా పూర్తిస్థాయిలో బయో ప్రింటెడ్ చర్మం రెడీ అయింది. దీన్ని అమెరికాలోని వేక్‌ ఫారెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీజెనరేటివ్‌ మెడిసిన్‌ పరిశోధకులు తయారు చేశారు. మనిషి చర్మంలో ఉండే ఆరు ప్రధాన కణాలు.. బయో ప్రింటెడ్ చర్మంలో కూడా ఉంటాయి. మనిషి చర్మంలోలాగే ఇందులోనూ 3 పొరలు ఉంటాయి.  అవి.. బాహ్యచర్మం, అంతర్గత చర్మం, హైపోడెర్మిస్. కాలిన గాయాలు, పుండ్లను తనంతట తానుగా మాన్చుకునే సామర్థ్యం బయో ప్రింటెడ్ చర్మానికి ఉంది. బయోప్రింటింగ్ అనేది చర్మానికి ఆల్టర్నేటివ్ లను ఉత్పత్తి చేయడానికి మంచి ప్రత్యామ్నాయ పద్ధతి అని శాస్త్రవేత్తలు అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join

  • ప్రత్యేకమైన హైడ్రోజెల్స్‌, ఆరు ప్రధాన చర్మ కణాలను ఉపయోగించి బయోప్రింటెడ్ చర్మాన్ని తయారు చేశారు.
  • ఇది కూడా మందపాటి మానవ చర్మాన్ని పోలి ఉంటుంది.
  • రీసెర్చ్ లో భాగంగా శాస్త్రవేత్తలు బయో ప్రింటెడ్ చర్మాన్ని కొన్ని ఎలుకలు, పందులకు గాయాలైన ప్రదేశాల్లో అతికించారు. దీంతో  అది సహజ చర్మంలో ఇమిడిపోయి.. త్వరగా ఆ నిర్దిష్ట ప్రదేశంలో గాయం మానిపోయేలా చేసిందని వెల్లడైంది.
  • బయోప్రింటెడ్ స్కిన్ అనేది మానవ సహజ చర్మంలాగే..  కొత్త రక్తనాళాలు వేగంగా ఏర్పడటానికి, ఆరోగ్యకరమైన చర్మ కణజాలం ఉత్పత్తిని ప్రేరేపించడానికి దోహదం చేస్తోందని సైంటిస్టులు గుర్తించారు.
  • గాయాలను నయం చేయడంలో, కాలిన మచ్చలను తగ్గించడానికి ఇది హెల్ప్ చేసిందని రీసెర్చ్ లో తేలింది.
  • తదుపరిగా ఈ బయో ప్రింటెడ్ చర్మంతో మనుషులపై క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించేందుకు వేక్ ఫారెస్ట్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు రెడీ అవుతున్నారు.
  • ఈమేరకు వివరాలతో కూడిన రీసెర్చ్ రిపోర్ట్  ‘సైన్స్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్’ అనే జర్నల్ లో (Bioprinted Skin) పబ్లిష్ అయింది.

Also read : Diabetes Smoothies: మధుమేహం ఉన్నవారు ఉదయాన్నే ఈ స్మూతీలు తాగితే చాలు..!